దుంప జాతి కూరగాయ పంటలలో కందపంట( Kandapanta ) ఒకటి.దీనిని వాణిజ్య పంటగా కూడా చెప్పుకోవచ్చు.
ఈ కందను కూరగాయగా, పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు.నల్లరేగడి నేలల్లో ఈ పంటలో అధిక దిగుబడి పొందవచ్చు.
ఈ పంటను మే, జూన్ నెలలో లేదంటే నవంబర్, డిసెంబర్ నెలలో విత్తుకోవచ్చు.సస్యరక్షక పద్ధతులు పాటిస్తే ఎకరాకు 30 టన్నుల దిగుబడి సాధించవచ్చు.
వేసవిలో బాగా నేలను లోతు దుక్కులు దున్నాలి.నీటి సౌకర్యం ఉండి, నీరు నిల్వ ఉండని సారవంత నేలలు ఈ పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి.
కంద దుంపలను పొలంలో నాటిన వెంటనే నీటి తడి అందించాలి.ఆ తర్వాత పది రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ, కలుపు పెరగకుండా నివారించాలి.
కందపంటను ఆకుపచ్చ తెగుళ్లు, ఖండం కుళ్ళు( Green pests, canker sores ) తెగులు లాంటివి ఆశించి పంటను నాశనం చేస్తాయి.
కాబట్టి పంట వేశాక మొదట కలుపును నివారించి, నీటి తడులు క్రమం తప్పకుండా అందిస్తూ ఈ తెగుళ్లపై దృష్టి పెట్టి తొలిదశలోనే వీటిని గుర్తించి నివారణ చర్యలు చేయాలి.ముఖ్యంగా ఈ పంట వేశాక సూక్ష్మ ధాతు లోపాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అవసరం అయితే తప్ప రసాయన ఎరువుల వాడకం చాలావరకు తగ్గించి పశువుల ఎరువులు,( Animal manure ) వర్మీ కంపోస్ట్ ఎరువులు పంటకు అందించాలి.
కందపంట వేశాక పూర్తిగా మొలకెత్తడానికి 40 రోజుల సమయం పడుతుంది.ఈ సమయంలో నీటి తడులు సరిగా అందకపోతే సూక్ష్మ పోషకాల కొరత ఏర్పడి పంట నాశనం అయ్యే అవకాశం ఉంది.
ఈ కందపంటను సాధారణ పొలాలలోనే కాక కొబ్బరి, అరటి తోటలలో అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు.మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు ఉన్నా కూడా ఈ కందపంట నుంచి మంచి ఆదాయం అర్జించవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy