Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు( Pranit Rao )ను రిమాండ్ లోకి తీసుకున్న పోలీసులు అడిషనల్ ఎస్పీలు( Additional SP ) భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కాగా పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై కోర్టులో రేపు విచారణ జరగనుంది.

కాగా వీరంతా జ్యువెలరీ వ్యాపారులు మరియు బిల్డర్ల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.హవాల వ్యక్తులను బెదిరించి ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.మరోవైపు ఈ కేసులో కొందరు కీలక నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో నాయకులకు కూడా నోటీసులు అందించి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement
How Modern Technology Shapes The IGaming Experience

తాజా వార్తలు