Delhi CM Arvind Kejriwal : కేజ్రీవాల్‎ను సీఎం పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) కు వ్యతిరేకంగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.

ఈ మేరకు అరవింద్ కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తప్పించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.

సామాజిక వేత్త, ఢిల్లీ వాసి సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ ను వేశారని తెలుస్తోంది.మనీ లాండరింగ్ కేసు( Money Laundering Case )లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కు సీఎంగా ఉండే అర్హత లేదని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కాంతివంతమైన ముఖానికి సులువైన చిట్కాలు
Advertisement

తాజా వార్తలు