బిగ్ బాస్ షో ఆపేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

బిగ్ బాస్ షో ఆపేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలిపారు.

ఐబీఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం సమయాన్ని పాటించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకే బిగ్ బాస్ షో ప్రసారం చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

కాగా ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement