భయపెడుతున్న పెథాయ్ తుఫాన్ !

ఇప్పటికే ఏపీని అతలాకుతలం చేసిన తిత్లీ, గజ తుఫాన్‌ నుంచి ఇంకా తేరుకోక ముందే ఇప్పుడు ముంచుకొస్తున్నపెథాయ్‌ తుఫాన్‌ ఏపీ తీరానికి దూసుకొస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

తుఫాన్‌తో తీర ప్రాంత గ్రామస్తులు గజ గజ వణికిపోతున్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర వాయు గుండం మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా మారె అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ తుఫాన్ .మచిలీపట్నానికి 870 కిలోమీటర్లు, చెన్నై 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.రేపు ఉదయానికి తుఫాన్ గా మారి ఆ తరువాత పెను తుఫాన్ గా మారే అవకాశం కనిపిస్తోంది.

అమలాపురం కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

పెథాయ్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా తీర ప్రాంతవాసులను అలర్ట్ చేస్తున్నారు.వెళ్లొద్దని సూచించారు.తుఫాన్‌ తీరం దాటే సమయంలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

ఈ అర్ధరాత్రి నుంచే కోస్తాంధ్రతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలోని వివిధ ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని…తుఫాను తీరం దాటే సమయంలో గంటకు వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని…తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.తుఫాన్ ప్రభావంతో 16, 17 తేదీల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పెథాయ్‌ తుఫాన్‌ ఏపీతో పాటు అటు ఒడిశా, దక్షిణ చత్తీస్‌గఢ్ పై కూడా ప్రభావం చూపనుంది.

Advertisement

తాజా వార్తలు