ప్రధాని మోడీని కలిసిన ‘ Perplexity AI ’ సీఈవో .. ఎవరీ అరవింద్ శ్రీనివాస్ ?

బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ Perplexity AI కో ఫౌండర్, సీఈవో అరవింద్ శ్రీనివాస్( CEO Arvind Srinivas ).

భారత ప్రధాని నరేంద్ర మోడీని( Narendra Modi ) కలిశారు.

ఈ భేటీకి సంబంధించి శ్రీనివాస్ తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఏఐ వృద్ధి, మార్కెట్ అవకాశాలపై తాము చర్చించినట్లుగా ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోడీ అంకితభావం, దార్శనికత పట్ల ఆయన తన ప్రగాఢమైన అభిమానాన్ని పంచుకున్నారు.అరవింద్ శ్రీనివాస్ తొలుత ఓపెన్ ఏఐలో ఇంటర్న్‌గా తన కెరీర్ ప్రారంభించారు.అతను పరిశోధనా శాస్త్రవేత్తగా ఓపెన్ ఏఐకి ( Open AI )తిరిగి రావడానికి ముందు డీప్ మైండ్, గూగుల్‌ తదితర సంస్ధల్లో రీసెర్చ్ ఇంటర్న్‌గా పనిచేశారు.2022లో ఆయన మరో ముగ్గురితో కలిసి పెర్‌ప్లెక్సిటీ ఏఐ పేరిట తన సొంత కంపెనీని ప్రారంభించారు.ఆండీ కొన్విన్స్కీ, డెనిస్ యారట్స్, జానీ హో తదితరులతో ప్రారంభించిన ఈ కంపెనీలో సీఈవోగా శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరించారు.

శాన్‌ఫ్రాన్సిస్కో ( San Francisco )కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న Perplexity AIలో దాదాపు 100 మంది ఉద్యోగులు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు.ఏఐ పవర్డ్ సెర్చ్ ఇంజిన్, రియల్ టైమ్ ఇన్‌ఫర్మేషన్ విభాగాల్లో ఈ సంస్థ పలు సేవలు అందిస్తోంది.ఎల్ఎల్ఎమ్ ఆధారిత జీపీటీ-3.5 విత్ బ్రౌజింగ్ విభాగంలో ఈ సంస్థ పలు పరిశోధనలు చేస్తోంది.2024లో ఫండింగ్ ద్వారా 165 మిలియన్ డాలర్లకు పైగా సేకరించిన ఈ సంస్థ బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది.అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సహా పలువురు సంపన్నులు ఈ కంపెనీకి ఇన్వెస్టర్లుగా ఉన్నారు.

Advertisement

చెన్నైలోని మద్రాస్ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీని శ్రీనివాస్ పొందారు.ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చిన ఆయన బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.ప్రస్తుతం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు శ్రీనివాస్.

హీరోలు ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తారు.. కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు