పెప్సీ కొత్త లోగో చూశారా? చూడండి, అదిరిపోలా?

పెప్సీ.ఈ పేరు వినగానే జనాల నోళ్ళల్లో ఊరిపోతోంది.పైగా వేసవి కాలం.

ఎండలో కాస్త తిరిగినవారికి నోరు పిడచకట్టి వెంటనే ఎదో ఒక కాల్ డ్రింక్ తాగాలని అనిపిస్తూ ఉంటుంది.మర్కెట్లో ఎన్నో బ్రాండ్లు వున్నా చాలామంది ముందుగా తగలనుకున్న బ్రాండ్స్ లో పెప్సీ అనేది తప్పకుండా ఉంటుంది.

ముఖ్యంగా బిర్యానీ ప్రియులు దాన్ని తిన్న తరువాత ఇలాంటి కూల్ డ్రింకులను తాగాలని అనుకుంటూ వుంటారు.కాబట్టి ఇదొక పరిచయం అక్కరలేని కూల్‌డ్రింక్‌ బ్రాండ్‌ అని చెప్పుకోవచ్చు.

విషయంలోకి వెళితే.త్వరలో పెప్సీ కంపెనీ( Pepsi ) 125వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది.ఈ సందర్భంగా కొత్త లోగోను సదరు కంపెనీ ఆవిష్కరించింది.

Advertisement

దీంతో దాదాపు 15 ఏళ్ల తర్వాత పెప్సీ లోగో మారబోతోందని ఈ సందర్భంగానే బయటపడింది.అయితే ఈ లోగో మార్పు అనేది మొదట ఉత్తర అమెరికాలో, ఆ తర్వాత 2024 నాటికల్లా ప్రపంచం అంతటా ఈ లోగో అమల్లోకి రానుంది.

కాగా ప్రస్తుతం ఉన్న పెప్సీ లోగో( Pepsi logo )ను 2008లో రూపొందించారు.మళ్లీ ఇన్నేళ్లకు కంపెనీ 125వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త లోగోను తీసుకొస్తోంది పెప్సీ.

ఇకపోతే ఈ పెప్సీ కొత్త లోగో మునుపటి లోగోకంటే ఆకర్షణీయంగా ఉందని చూపరులు అంటున్నారు.నల్లటి వృత్తం మధ్యలో ఉండగా.పెద్దగా PEPSI అనే అక్షరాలు, దాని చుట్టూ ఎరుపు, తెలుపు, నీలం చారలు ఉండడం ఈ లోగోలో గమనించవచ్చు.

కంపెనీ లోగోకు గొప్ప శక్తి, విశ్వాసం, ధైర్యాన్ని అందించడానికి రీడిజైన్ చేసినట్లు పెప్సికో చీఫ్ డిజైన్ ఆఫీసర్ మౌరో పోర్సిని ఈ సందర్భంగా తెలిపారు.యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో మొదటగా ఎలక్ట్రిక్ బ్లూ, బ్లాక్ క్యాన్‌లపై పెప్సీ కొత్తలోగోను వినియోగిస్తారు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
చర్మ ఆరోగ్యం కొరకు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు

దీంతోనే అక్కడ మార్కెటింగ్ కూడా చేస్తారు.తర్వాత 2024లో ప్రపంచమంతటా కొత్త లోగోను పరిచయం చేసే అవకాశం వుంది.

Advertisement

తాజా వార్తలు