హై బీపీ ఉన్న‌వారు ఈ ఆకుకూర‌లు ఖ‌చ్చితంగా తినాల‌ట‌.. తెలుసా?

హై బీపీ లేదా అధిక ర‌క్త‌పోటు.ప్ర‌స్తుత రోజుల్లో కోట్లాది మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.

వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎంద‌రో అధిక ర‌క్త‌పోటుకు బాధితులుగా మారుతున్నారు.ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో చోటు చేసుకున్న మార్పులు, ఒత్తిడి, నిద్ర‌లేమి ఇలా వివిధ కార‌ణాల వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

దాంతో పెరిగిన ర‌క్త‌పోటు స్థాయిల‌ను అదుపులోకి తెచ్చుకోవ‌డం కోసం త‌ర‌చూ మందులు వాడుతుంటారు.అయితే కొన్ని కొన్ని ఆహారాల‌తోనూ ఈ హై బీపీని కంట్రోల్ చేసుకోవ‌చ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే ఆకుకూర‌లు అందుకు అద్భుతంగా సహాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ ఆకుకూర‌లు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.బ‌చ్చ‌లి కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Advertisement

ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా అడ్డు క‌ట్ట వేస్తుంది.అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి ఇది చక్కటి మెడిసిన్ లా కూడా పని చేస్తుంది.

హైబీపీ పేషెంట్లు వారంలో క‌నీసం రెండు సార్లు అయినా బ‌చ్చ‌లి కూర‌ను తీసుకుంటే ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది.పాల‌కూర‌.

దీనిని గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.అపార‌మైన పోష‌కాలు క‌లిగి ఉండే పాల‌కూర‌ను అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డేవారు ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

త‌ద్వారా హై బీపీ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

వింటర్ సీజన్ లో ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మీ స్కిన్ సూపర్ స్మూత్ అండ్ షైనీ గా మెరవడం ఖాయం!

పుదీనా.అమోఘ‌మైన ఆకుకూర‌ల్లో ఇది ఒక‌టి.దీనిని నిత్యం తీసుకుంటే ర‌క్త‌పోటు కంట్రోల్‌లో ఉంటుంది.

Advertisement

వాంతులు, వికారం వంటివి దూరం అవుతాయి.జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా ప‌ని చేస్తుంది.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.మ‌రియు శ‌రీరంలో అధిక వేడి కూడా తొల‌గిపోతోంది.

క‌రివేపాకు.చాలా మందిని దీనిని అస్స‌లు ప‌ట్టించుకోరు.

కూర‌ల్లో వ‌చ్చినా ఏరి ప‌క్క‌న పెట్టేస్తుంటారు.కానీ, హై బీపీ ఉన్నావారు త‌ప్ప‌కుండా క‌రివేపాకును తీసుకోవాలి.

అందులోనూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులను రెగ్యుల‌ర్‌గా న‌మిలి తింటే ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది.