మొటిమలు ఉంటే ఒక లాభం కూడా ఉంది

మొటిమలు అంటే అందరికి చిరాకే.ఒక్క చిన్ని మొటిమ వచ్చిన ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయినట్టు బాధపడిపోతారు కొందరు.

ఇక దురదృష్టం కొద్ది చాలామందిని మొటిమలు రోజూ పలకరిస్తాయి.వంశపారంపర్యంగా కావచ్చు, ఆహారపు అలవట్ల వలన కావచ్చు, హార్మోన్స్ లో ఇంబ్యాలెన్స్ వలన కావచ్చు, మొటిమ ఎలా వచ్చినా ముఖం యొక్క అందానికి చేయాల్సిన చేటు చేసే వెళుతుంది.

కాని మొటిమల వలన ఓ లాభం కూడా ఉంది అంటున్నారు లండన్ పరిశోధకులు.ఇదేమి వింత అని ఆశ్చర్యపోకుండా సంగతేంటో తెలుసుకోండి.

లండన్ లో కింగ్స్ కాలేజ్ లో కొంతకాలంగా మొటిమల మీ ఓ పరిశోధన జరుగుతోంది.ఈ పరిశోధనలో మొటిమలు ఉన్నవారి మీద మొటిమలు లేని వారి మీద చాలారకాల పరీక్షలు నిర్వహించారు.

Advertisement

ముఖ్యంగా జెనెటిక్స్, డిఎన్‌ఏ మీద ఎక్కువ శ్రద్ధ చూపారు.ఫలితాలు ఆశ్చర్యకరం.

డిఎన్‌ఏ ని కాపాడే టెలిమోర్స్, మొటిమలు ఉన్నవారి కంటే లేనివారిలో తక్కువగా కనిపించాయంట.దీనర్థం మొటిమలు ఉన్నవారి చర్మం భవిష్యత్తులో త్వరగా డ్యామేజ్ అవదు.

అంటే మొటిమలు లేనివారు త్వరగా వయసు పెద్దగా అయిపోయినవారి లాగా కనబడతారట.మొటిమలు ఉన్నవారు ఎక్కువ కాలం యంగ్ గా కనబడే అవకాశాలు ఉన్నాయట.

"చాలా సంవత్సరాలుగా డెర్మాటాలిజిస్టులు చెబుతున్నారు.మొటిమలతో బాధపడిన చర్మం త్వరగా పాతబడదు.

కఠినమైన చర్మాన్ని సూపర్ స్మూత్ గా మార్చే సింపుల్ టిప్ మీకోసం!

మొటిమలు రానివారి చర్మం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది వయసు పెరిగినాకొద్ది.మా పరిశోధనలో చెప్పినట్లు, టెలిమోర్స్ పరిమాణంలో తేడా ఉండటంతో ఇలా జరుగుతుంది" అంటూ సిమోన్ రిబేరో అనే పరిశోధకుడు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు