ఇదేందయ్యా ఇది.. ఇసుకతో గిన్నెలు తోముతున్న వ్యక్తులు.. వీడియో వైరల్..

1930-1940లలోనే వంట సామాన్లను లిక్విడ్‌తో( Liquid ) తోముకునే విధానానికి ప్రజలు అలవాటు పడ్డారు.

అంతకుముందు ఇసుక, కలప బూడిద, ఆవు పేడ బూడిద, ఇటుక లేదా ఎముకల ధూళి, బేకింగ్ సోడా వంటి వాటిని వాడేవారు.

ఇప్పుడు అవన్నీ పోయాయి.అయితే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వంట సామాగ్రిని స్క్రబ్ చేయడానికి ఇప్పటికీ ఇసుక, కొబ్బరి పీచును ఉపయోగిస్తున్నారు.

ఇటీవల ఓ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో పురుషులు ఇసుకతో ( Sand ) గిన్నెలు శుభ్రం చేశారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కొంతమంది ఈ పద్ధతిని అపరిశుభ్రంగా ఉందని విమర్శించగా, మరికొందరు వంట సామాన్లను( Utensils ) శుభ్రం చేయడానికి ఇది సమర్థవంతమైన మార్గంగా గుర్తించారు.వీడియోను పోస్ట్ చేసిన వినియోగదారు ఈ పద్ధతితో వంటల ప్లేట్లు, గిన్నెలలో నూనెను తొలగించడం సులభం అని కూడా వ్యాఖ్యానించాడు.

Advertisement

చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్‌పై కామెంట్ చేస్తూ ఈ పద్ధతి పర్యావరణ అనుకూలమైనదని, ప్రభావవంతంగా ఉందని ప్రశంసించారు.అయితే, మరికొందరు వంట సామాన్లు, ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లేట్లను శుభ్రం చేయడానికి ఇసుకను ఉపయోగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

డిష్‌లను శుభ్రం చేయడానికి ఇసుక లేదా సాడస్ట్‌ని ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు, అప్రయోజనాలు రెండూ ఉన్నాయి.అయితే దీనిని ఇప్పటికీ మలేషియా, ఇండోనేషియా దేశాలలో చాలా మంది ఫాలో అవుతున్నారు.ఇక కొంతమంది వంటల సామాన్లలోని నూనెను తొలగించడానికి అరటి కాడలను కూడా ఉపయోగిస్తారు.

ఇకపోతే ప్రజలు వంటలను ఇసుకతో రుద్దడం, శుభ్రమైన నీటితో కడగడం ద్వారా వాటిని శుభ్రం చేస్తారు.అయితే, 20వ శతాబ్దంలో డిష్‌వాషింగ్ డిటర్జెంట్లు, ఎలక్ట్రిక్ డిష్‌వాషర్‌ల ఆవిష్కరణతో, ఈ పద్ధతులు దాదాపు కనుమరుగయ్యాయి.

చర్మ ఆరోగ్యం కొరకు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు
Advertisement

తాజా వార్తలు