శరన్నవరాత్రుల్లో అమ్మవారు మెచ్చే నైవేద్యాలు ఏంటో తెలుసా..?

దసరా వచ్చేస్తోంది.నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.

ఈ ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

శరన్నవరాత్రుల్లో లిచే దుర్గామాతకు నవ నైవేద్యాలను నివేదిస్తారు.

అయితే అమ్మవారు మెచ్చే ఆ ప్రసాదాలు ఏంటో మీరో ఓసారి చూడండి.

చిట్టి గారెలు

తొమ్మిదిరోజులు దుర్గమ్మ.మహిషాసురుడితో యుద్ధం చేస్తుంది.

Advertisement
People Must Know These Special Prasadam For Ammavaru In Navaratri , Prasadam ,

అలసట రాకుండా మాష చక్రములు అంటే చిట్టిగారెల్ని పెడతారు.అమ్మవారికి ఇష్టమైన మినుములతో వీటిని చేస్తారు.

కట్టె పొంగలి

.పెసరపప్పు, బియ్యం, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి.

తయారు చేసే కట్టె పొంగలిని భవానీ మాత ఎంతో ఇష్టంగా తింటుందట.

దద్యోజనం:

శాంతి రూపాన్ని కోరుకుంటూ, అందరికీ చల్లని దీవెనలు అందించమంటూ అన్నపూర్ణాదేవికి పెరుగుతో చేసిన దద్యోజనం ప్రసాదంగా నివేదిస్తారు.

People Must Know These Special Prasadam For Ammavaru In Navaratri , Prasadam ,

నువ్వులన్నం

: నువ్వులు, కొబ్బరి, ఉప్పు, కారం వేసి ఈ అన్నాన్ని వండుతారు.అసురులతో పోరాడే కాళికకు నువ్వుల్లో ఉండే విష్ణుశక్తి తోడవ్వాలని ఇలా చేస్తారు.

People Must Know These Special Prasadam For Ammavaru In Navaratri , Prasadam ,
స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?

చిత్రాన్నం హరి

.దుర్గమ్మ మెచ్చే ప్రసాదాల్లో నిమ్మకాయ పులిహోర కూడా ఒకటి.పోపు సామగ్రి వేసి రుచికరంగా చేసే దీన్ని అమ్మవారు ఇష్టంగా ఆరగిస్తారనేది నమ్మకం.

Advertisement

గూడాన్నం

.సహస్రనామాల్లో గూడాన్న: ప్రీత మానస అంటూ చదువుకుంటాం.ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం, పిసరపప్పు, బియ్యం, ఉడకబెట్టి బెల్లం, సుగంధ ద్రవ్యాల పొడి, నెయ్యి, ఎండు ఫలాలను వేసి తయారు చేస్తారు.

సకల శుభాలూ అందించమని కోరతారు.

కదంబం ప్రసాదం

: దశమిరోజున పదకొండు రకాల , పప్పు, బియ్యంతో చేసిన కదంబాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు.

అప్పాలు

: అమ్మవారి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి.ఆయన మెచ్చే అప్పాలే అమ్మవారికి నివేదిస్తారు.

గోధుమ పిండి, బియ్యప్పిండి, బెల్లం, సుగంధ ద్రవ్యాల పొడి వాడి వీటిని చేస్తారు.

శాకాన్నం

తొమ్మిది రకాల కూరగాయలు, తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాల పొడి వేసి నవశక్తికి నైవేద్యంగా పెడతారు.సన్యవృద్ధిని కోరుకుంటూ దీన్ని దుర్గమ్మకు పెడతారు.

తాజా వార్తలు