ఎక్కడా లేని కూర్మావతార దేవుడి క్షేత్రమైన శ్రీకూర్మం ఆలయం గురించి మీకు తెలుసా?

మహా విష్ణువు దశావతారాల్లో రెండోది కూర్మావతారం.ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం.

భారత దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు.శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలో మీటర్ల దూరంలో.

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ కు 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉందీ ఆలయం.బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధి.

అంతేకాదు మరెన్నో విశిష్టతలు.ఈ ఆలయం సొంతం.

Advertisement

ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి.స్వామివారు కూడా పడమటి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత, కూర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీరామానుజాచార్యులు, శ్రీ సరద రాజస్వామి.

శ్రీ మద్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి.పవిత్ర పుష్కరిణి, విశాలమైన | ప్రాకారంతో పాటు కూర్మవతారానికి నిజరూపమైన తాబేళ్లు ఇక్కడ కనువిందు చేస్తాయి.

స్థల పురాణం .పూర్వం దేవ దానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మదించడానికి యత్నించి, మందర పర్వతాన్ని కన్నంగా చేసుకున్నారు.కింద ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవ లేదు.

దాంతో దేవతలు శ్రీ మహా విష్ణువుని ప్రార్ధించగా.విష్ణువు తాబేలు అవతారమెత్తి మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడని కూర్మ పురాణం చెబుతోంది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి27, సోమవారం 2025

ఆ రూపాన్ని బ్రహ్మ దేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు.ఈ క్షేత్ర ప్రస్తావన పళ్లు పురాణంలోనూ, బ్రహ్మండ పురాణంలోనూ కనిపిస్తుంది.

Advertisement

పితృ కార్యాలయాలంటే ముందుగా గుర్తొచ్చేది కాశీ.అయితే వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు.కాశీ వెల్లలేని చాలామంది ఇక్కడే పితృ కార్యాలు నిర్వహిస్తుంటారు.

వారణాసి నుంచి గంగామాత ప్రతి మాఘ శుద్ధ చవితి నాడు ఇక్కడికి వచ్చి శ్వేత పుష్కరిణిలో స్నానం ఆచరిస్తుందని చెబుతారు.తాము విడిచిన పాపాలను ఆ మాత ప్రక్షాళన చేస్తుందని భక్తుల నమ్మకం.

అంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో పితృ దేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారుతాయని ఇక్కడి వారి విశ్వాసం.అందుకే చాలామంది ఇక్కడ తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తుంటారు.

తాజా వార్తలు