ఏపీని చంద్రబాబు ఎలా దోచుకున్నారో ప్రజలకు తెలుసు..: మంత్రి సిదిరి

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu )పై మంత్రి సిదిరి అప్పలరాజు( Seediri Appalaraju ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా పని చేసి ఏపీకి చేసిందేమీ లేదని ఆరోపించారు.


రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా దోచుకున్నారో ప్రజలకు తెలుసని మంత్రి సిదిరి అప్పలరాజు తెలిపారు.టీడీపీ( TDP ) హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా తెచ్చారా అని ప్రశ్నించారు.కనీసం ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చారా అని నిలదీశారు.

తాము అధికారంలోకి వచ్చిన తరువాత తమ ప్రభుత్వం నాలుగు పోర్టులను నిర్మిస్తుందన్నారు.రుషికొండను అభివృద్ధి చేశామన్న మంత్రి సిదిరి 2.65 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement