కొత్త రకం గ్లాస్ రూపొందించిన శాస్త్రవేత్తలు.. ఇది పది రెట్లు బలమైనది..!

మానవుల జీవితంలో గ్లాస్ అనేది ఒక భాగం అయిపోయింది.కిటికీల గ్లాసుల నుంచి ఎంట్రెన్స్ డోర్ల వరకు అన్నింటిలో గ్లాసులు విరివిగా వాడుతున్నారు.

అయితే చాలా సంవత్సరాలుగా ప్రజలు వాడుతున్న గ్లాస్ అనేది పర్యావరణానికి హాని చేకూర్చేలా తయారవుతుంది.ఇది చాలా ఎక్కువ ప్రాసెస్ తీసుకుంటుంది.

దీనివల్ల కార్బన్‌ డయాక్సైడ్( Carbon Dioxide ) అధికంగా వాతావరణంలోకి విడుదలై అన్ని జీవుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోంది.

ఈ సమస్యకు పరిష్కారంగా పెన్సిల్వేనియాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు లయన్ గ్లాస్( LionGlass ) అనే కొత్త రకం గాజును రూపొందించారు.ఈ గాజు సాంప్రదాయ గాజు కంటే చాలా బలంగా ఉంటుంది.అంతేకాదు ఈ గ్లాస్ పర్యావరణానికి ఎలాంటి హాని తల పెట్టదు.

Advertisement

ఎందుకంటే ఈ గ్లాస్‌ను తక్కువ శక్తిని ఉపయోగించి తయారు చేశారు.ఉత్పత్తి సమయంలోనూ ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయదు.

లయన్ గ్లాస్ సాధారణ గాజు కంటే సుమారు 10 రెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది కాబట్టి ఇది అంత త్వరగా పగిలిపోదు.

వీటికి బలం ఎక్కువ కాబట్టి వివిధ అవసరాలకు ఈ గ్లాసులను సన్నగా, తేలికగా( Thinner, Lighter ) తయారు చేయవచ్చు.బలమైన, నమ్మదగిన గాజు అవసరమయ్యే ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్( Electronics ) వంటి పరిశ్రమలలో లయన్‌గ్లాస్‌ను ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.పర్యావరణం, శక్తి, ఆరోగ్య సంరక్షణ, నగరాలు వంటి రంగాలలో ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి వారు లయన్‌గ్లాస్, దాని లక్షణాల గురించి మరింత తెలుసుకోవడానికి దాని విభిన్న కూర్పులను అధ్యయనం చేయడం కొనసాగిస్తున్నారు.

ఒక గ్లాసు మాత్రమే కాదు పర్యావరణానికి హాని చేసే చాలా వస్తువులు ప్రస్తుతం ప్రజలు విరివిగా వాడుతున్నారు.వాటికి ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలమైన వెర్షన్లను శాస్త్రవేత్తలు( Scientists ) తీసుకురావడానికి నిత్యం కృషి చేస్తూనే ఉన్నారు.

నైట్‌ నిద్రించే ముందు ఇలా చేస్తే.. వేక‌ప్ అద్భుతంగా ఉంటుంది!

అలాగే ఈ భూ ప్రపంచాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు