ఎన్సీపీకి పవార్ రాజీనామా.. కారణం ఎవరు ?

మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తూ ఉంటాయి.

నిన్న మొన్నటి వరకు షిండే, ఉద్దవ్ థాక్రే( Shinde, Uddhav Thackeray ) మద్య జరిగిన రాజకీయ పరిణామాలు ఎంతటి చర్చనీయాంశం అయ్యాయో అందరికీ తెలిసిందే.

ఇక ఇటీవల ఆ రాష్ట్రంలోకి బి‌ఆర్‌ఎస్ ఎంట్రీతో మరోసారి మహారాష్ట్ర పాలిటిక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదిలా ఉంచితే ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అయినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా అంతర్మథనం జరుగుతోంది.

శరత్ పవార్ ( Sharat Pawar )నేతృత్వంలో నడుస్తున్న ఆ పార్టీలో దాదాపుగా 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను లాక్కునేందుకు శివసేన షిండే వర్గం ప్రయత్నిస్తోందని ఈ మద్య కాలంలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

అయితే ఇలా ఎమ్మెల్యేల పార్టీ మార్పు వెనుక ఎన్సీపీలోని మరో కీలక నేత ప్రదీప్ పవార్ ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.ప్రదీప్ పవార్( Pradeep Pawar ) బీజేపీతో తరచూ టచ్ లో ఉంటున్నారని, ఎన్సీపీలో కూడా శివసేన( Shiv Sena ) మాదిరిగా షిండే వ్యూహానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇలా రాకల్రకాల చర్చలు నడిచాయి.అయితే ఈ వార్తలపై అటు శరత్ పవార్ ఇటు ప్రదీప్ పవార్ ఇద్దరు కూడా గట్టిగానే ఖండించారు.

Advertisement

అయినప్పటికి ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.అయితే నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా తాజాగా ఎన్సీపీ అధినేత శరత్ పవార్ ఆ పార్టీ ప్రసిడెంట్ పదవికి రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.

దేశ రాజకీయాల్లో చతురత కలిగిన నేతగా శరత్ పవార్ కు మంచి పేరుంది అలాంటి నేత అనూహ్యంగా పార్టీ ప్రసిడెంట్ పదవికి రాజీనామా చేయడం ఎంటనే చర్చ నేషనల్ మీడియాల్లో జోరుగా సాగుతోంది.అయితే పవార్ రాజీనామా వెనుక ఆ పార్టీలో నెలకొన్న సంక్షోభమే అనే వాదన వినిపిస్తోంది.20 మంది ఎన్సీపీ ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని షిండే వర్గం నేత ఉదయ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా శరత్ పవార్ డైలమాలో పడినట్లు తెలుస్తోంది.

గత కొన్నాళ్లుగా ఎన్సీపీలో కూడా పవార్ నాయకత్వంపై వ్యతిరేఖ గళం వినిపిస్తోంది.దీంతో ఇదే సరైన సమయం అన్నట్లుగా శరత్ పవార్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.

ఇప్పుడు ఎన్సీపీ బాద్యతలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?
Advertisement

తాజా వార్తలు