విలీనమా ? పోరాటమా : పవన్ ఏ విషయం తేల్చుకోలేకపోతున్నాడా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో తానేంటో నిరూపించుకుని కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాందించాడు.

అదే ఇమేజ్ తో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కష్టాలను తీర్చాలని తాపత్రయపడ్డాడు.

అయితే తాను ఒకటనుకుంటే విధి ఇంకొకటి తలచింది.ఏపీ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీకి ఒక్క స్థానంలో మాత్రమే విజయం వరించింది.

ఇక తమ ప్రధాన ప్రతియార్దిగా భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీ సాధించి రికార్డు సృష్టించింది.ఇటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీని ముందుకు నడిపించే విషయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గందరగోళ స్థితిని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది.

మరో నాలున్నరేళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసలు పడి పార్టీని ముందుకు నడిపించాలి.ఈ నేపథ్యంలో ఆయనకు ఇప్పటి నుంచే అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

Advertisement

మూడేళ్లు సినిమాలు చేద్దాం అంటే ఇప్పటికే ఉన్న పార్ట్ టైం పొలిటీషియన్ అనే ముద్ర ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది.అలా అని పూర్తి సమయం రాజకీయాలకు కేటాయిద్దామా అంటే అది కూడా కుదిరేలా కనిపించడంలేదు.

అలా చేయాలంటే ప్రజా ఉద్యమాలు చేయాలి.ప్రతి రోజు ఏదో ఒక సమస్య మీద పోరాటం చేస్తూనే ఉండాలి, కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అలాంటివి చేయాలంటే కొంచం ఇబ్బందే.

అసలు పవన్ నుంచి అలాంటి ఉద్యమాలు ఆశించటం కష్టం.ఇక ప్రస్తుతం అయితే పవన్ కు సినిమాల్లో నటించమని ఆఫర్ ల మీద ఆఫర్ లు వచ్చిపడుతున్నాయి.

దీంతో అటు సినిమాలకూ ఒకే చెప్పలేక ఇటు రాజకీయాల్లో ఇమడలేక సతమతం అవుతున్నట్టు కనిపిస్తోంది.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

ప్రస్తుతానికి తన అన్న నాగబాబు ని జనసేన పార్టీ సమన్వయ కర్తగా నియమించాడు పవన్ కళ్యాణ్ .ఇలా తన ఫ్యామిలీ వ్యక్తిని పార్టీలో కీలకం చేసి, తాను చిన్నగా సినిమాలు వైపు పోదామనే ఉద్దేశ్యంతో ఉన్నాడేమో అన్న అనుమానాలు కూడా అప్పుడే మొదలయిపోయాయి.ఇక బీజేపీ అయితే జనసేన పార్టీని విలీనం చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది.

Advertisement

అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఏదో ఒక కీలక పదవి అప్పగిస్తామని ఆఫర్లు ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ లో జనసేన ను విలీనం చేసే ప్రసక్తే లేదని పవన్ చెబుతున్నా లోపల మాత్రం విలీనం చేసేస్తేనే బెటర్ అనే ధోరణి పవన్ లో కనిపిస్తోంది.

ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం పవన్ కు ఈ రాజకీయాలు గందరగోళంగానే కనిపిస్తున్నట్టు అర్ధం అవుతోంది.

తాజా వార్తలు