యూరప్‌లో గ్రాండ్‌గా కొడుకు ఫంక్షన్‌ చేయనున్న పవన్‌

సినీ హీరోగా తన కెరియర్‌ పవర్‌స్టార్‌గా ఎదిగిపోయిన తర్వాత పవన్‌ గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ఇక సినీ జివతం చాలు అంటూ తన రాజకీయ జీవితానికి తెర లేపాడు.

జనసేన పార్టీని స్థాపించి ప్రజా సేవ చేయాలనుకుంటున్నాడు.గతకొంత కాలంగా చురుగ్గా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

క్రిస్మస్‌ తర్వాత పవన్‌ అమరావతిలో ఉంటూ జనసేన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయనున్నట్టు సమాచారం.

క్రిస్మస్‌ వేడుకల కోసం పవన్‌ యూరప్‌ వెళుతున్నట్టు సమాచారం.తన మూడో భార్య మరియు కొడుకుతో పూర్తి స్థాయి ఫ్యామిలీ ట్రిప్‌ను ప్లాన్‌ చేశారట.పవన్‌ మరియు తన మూడో భార్యల సంతానం శంకర పవనో విచ్‌ కు క్రిస్మస్‌ సందర్భంగా ఏవో మతాచారాల ఫంక్షన్‌ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Advertisement

క్రిస్టియన్‌లకు చిన్న తనంలో చేసే కార్యక్రమాలు తన కొడుక్కి ఇంకా చేయలేదని, ఈ సారికి వాటిని గ్రాండ్‌గా చేయాలని సతీమణి అడగగా అందుకు పవన్‌ ఈ ట్రిప్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది.

మొత్తానికి పవన్‌ తన కొడుకు ఫంక్షన్‌ ను యూరప్‌లో చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నాడు.ఫ్యామిలీతో పండగను ఎంజాయ్‌ చేసి వచ్చిన తర్వాత ఇక మకాం అమరావతికి మార్చి ఎన్నికల కోసం ఇప్పటి నుండే చురుగ్గా ప్రచారం మొదలు పెట్టనున్నట్టు సమాచారం.సినీ, రాజకీయ, వైవాహిక జీవితం ఎలా ఉన్నా కూడా తన పిల్లల కోసం మాత్రం అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తాడు అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లల కోసం మాత్రం చాలా సమయాన్ని కేటాయిస్తాడు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement