పవన్ షణ్ముఖ అస్త్రం.. ఫలిస్తుందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తీసుకునే నిర్ణయాలు, అమలు చేస్తున్న వ్యూహాలు రాజకీయ వర్గాల్లో ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న పవన్.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పదే పదే చెబుతున్నారు.అందుకోసం తాను ఏం చేయడానికైనా సిద్దమే అనే సంకేతాలను కూడా ఇస్తున్నారు.

ఇప్పటికే పొత్తులపై తుది నిర్ణయానికి వచ్చిన పవన్.వాటిపై ముందు రోజుల్లో మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇక ఇప్పుడు ప్రజలను ఆకట్టుకోవడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా యూత్ టార్గెట్ గా పవన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అందులో భాగంగానే ఇటీవల షణ్ముఖ( Shanmukha ) వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు స్వయంగా పవనే చెప్పుకొచ్చారు.అందులో భాగంగా యువతకు నియోజిక వర్గాల వారీగా ప్రదాన్యత కల్పించడం, ప్రతి నియోజిక వర్గంలో 500 మంది యువతను ఎంపిక చేయడం వారికి పది లక్షల రూపాయల పెట్టుబడి సాయం అందించడం, వారిని ఎంటర్ ప్రినర్స్ గా తయారు చేయడం, వారి ద్వారా మరో 10 నుంచి 20 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం.ఇవన్నీ షణ్ముఖ వ్యూహంలో భాగంగా అమలు చేయనున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.

కాగా 2019 లో యువతను టార్గెట్ చేస్తూ వైఎస్ జగన్( YS Jagan ) 4 లక్ష్యాల ఉద్యోగలంటూ అందరి దృష్టిని ఆకర్షించారు.కానీ వాలెంటరీ వ్యవస్థ అంటూ ఎవరు ఊహించని విధంగా కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టి నిరుద్యోగ ఆశలను నీరుగార్చారు.మళ్ళీ ఇప్పుడు పవన్ కూడా యువతే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

అయితే పవన్ ఉద్యోగ ప్రకటనలు కాకుండా యువతను ఎంటర్ ప్రినర్స్ గా తయారు చేసేందుకు, వారే ఇతరులకు పని కల్పించేలా ఉండేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారు.మరి ఈ షణ్ముఖ వ్యూహం ఆలోచన బాగానే ఉన్నప్పటికి.

దీనిపై పవన్ ఆచరణ ఎలా ఉండబోతుందనేదే ఆసక్తికరం మరి యువతే లక్ష్యంగా పవన్ అమలు చేయబోతున్న షణ్ముఖ వ్యూహం ఎంతవరుకు ఫలిస్తుందో చూడాలి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు