పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చివరి దశ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా పూర్తయిన వెంటనే జనసేన పార్టీ కార్యక్రమాల విషయమై బిజీ బిజీగా ఆయన పర్యటన ఉండబోతుందట.
ఈ నేపథ్యంలో ఆయన కమిట్ అయిన సినిమాల పరిస్థితి ఏంటీ అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాల విషయంలో కంటే కూడా ఆయన ఎక్కువగా ప్రస్తుతం
దృష్టి పెడుతున్నాడు.
అందుకే ఆయన కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ మరియు సుజీత్ సినిమాల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.పైగా ఈయన వినోదయ్య సిత్తం సినిమా యొక్క రీమేక్ కు కూడా రెడీ అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి.
ఇన్ని సినిమాలు ఎప్పుడు ఎలా చేస్తాడు అనేది అర్థం కావడం లేదు అంటూ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా కూడా నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.
హీరోగా పవన్ కళ్యాణ్ కు ఇప్పటికి కూడా ఉన్న క్రేజ్ నేపథ్యం లో ఆయన సినిమా అంటే అభిమానులు భారీ ఎత్తున వస్తారు సినిమా మినిమంగా ఉన్నా కూడా వందల కోట్లు వస్తాయి.అయినా కూడా ఆయన రాజకీయాలు అంటూ బిజీ అవ్వడం పట్ల ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సినిమా లు చేయలేకుంటే ఎందుకు ఇలా కమిట్ అవ్వడం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి పవన్ యొక్క ఆ కమిట్ అయిన సినిమాల పరిస్థితి ఏంటో అర్థం కాక ఆ సినిమాల యొక్క మేకర్స్ మరియు అభిమానులు అంతా కూడా జుట్టు పీక్కుంటున్నారు.పవన్ కళ్యాణ్ యొక్క హరి హర వీరమల్లు సినిమా యొక్క విడుదల తేదీ విషయం లో కూడా ఇంకా స్పష్టత రావడం లేదు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy