సీఎం జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు కావటంతో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున జరుపుతున్నారు.ముఖ్యంగా 50వ జన్మదినోత్సవం సందర్భంగా.

అన్ని నియోజకవర్గాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో సైతం.

వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు ఈ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఇక ఇదే సమయంలో పలువురు కేంద్ర మంత్రులు ఇంకా ప్రధాని మోడీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం సీఎం జగన్ కి బర్తడే విషెస్ తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు."ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Advertisement

ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను" అని పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024
Advertisement

తాజా వార్తలు