వచ్చే ఏడాది నుండి తెలంగాణ లో విస్తృతంగా తిరుగుతా- వరంగల్ సభలో పవన్ కళ్యాణ్

మరో వారం రోజుల్లో తెలంగాణ ప్రాంతం లో అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) జరగబోతున్న సంగతి అందరికీ తెలిసందే.

రాజకీయ పార్టీలు తమ పార్టీ సిద్ధాంతాలను మరియు మ్యానిఫెస్టోలను ప్రతీ గడపకి చేర్చే పనిలో నిమగ్నమై ఉన్నారు.

అయితే ఈ ఎన్నికలకు ఒక్క పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )జనసేన పార్టీ తప్ప, మిగతా ఆంధ్ర పార్టీలు దూరం గా ఉన్నాయి.ఎన్నో దశాబ్దాల నుండి గణనీయమైన ఓటు బ్యాంక్ ఉన్న టీడీపీ పార్టీ కూడా పోటీ నుండి ఉపసంహరించుకుంది.

ఇక వైసీపీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అలాంటి ఈ సమయం లో కొత్త పార్టీ అయిన జనసేన( Janasena ) ధైర్యం చేసి పోటీ చెయ్యడం హర్షణీయం అనే చెప్పాలి.

అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తాడా లేదా అనే అనుమానాలు జనాల్లో ఉండేవి.కానీ ఆయన ఎన్నికల ప్రచారం నేడు వరంగల్ లో ప్రారంభించాడు.

Advertisement

పొత్తులో ఉన్న వరంగల్ అభ్యర్థి పద్మ రావు తరుపున ప్రచారం చేసాడు.

ఈరోజు మీటింగ్ ఉన్న సంగతి నిన్న సాయంత్రం ఖరారు చేసారు.అప్పటికప్పుడు అంత పెద్ద గ్రౌండ్స్ లో జనాలు ఎలా వస్తారు, సభ మొత్తం కాళీగా ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు.కానీ వేలాది గా సభకి తరళి వచ్చి విజయవంతం చేసాడు.

పవన్ కళ్యాణ్ కి తెలంగాణ ( Telangana )లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్టార్ హీరోకి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఖుషి సమయం నుండి ఆయనకీ అదే రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

అందుకే పవన్ ఒక్క పిలుపు పిలిస్తే తెలంగాణ లో ఏ ప్రాంతం లో అయినా జనాలు తండోపతండాలుగా వస్తారు.ఇకపోతే నేడు ఆయన తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!

అయితే ఈ సభలో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా అధికార బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు చెయ్యలేదు.

Advertisement

ఆయన మాట్లాడుతూ జనసేన జెండా పుట్టిన గడ్డ ఇది, వేల మంది బలిదానాలు ద్వారా తెచ్చుకున్న ఈ తెలంగాణ కి గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కి( BRS party ) జనాలు పట్టం కట్టారు, మనం ఇక్కడ విస్తృతంగా తిరగలేదు, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో చూడలేదు కాబట్టే నేను ప్రభుత్వం పై విమర్శలు చెయ్యడం లేదు.కానీ మీరు బలంగా రావాలని కోరుకుంటే మాత్రం వచ్చే ఏడాది ఆంధ్ర ప్రదేశ్ లో ఎలా అయితే తిరిగానో, తెలంగాణ లో కూడా అదే రేంజ్ తిరుగుతాను.ఎదో ఒకరోజు ఇక్కడ ప్రతీ గ్రామం లో జనసేన జండా ఎగురుతుంది.

నేను మీకు మాటిస్తున్నాను, తెలంగాణ ని ఎప్పటికీ వదలను అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.

తాజా వార్తలు