రాజకీయాల్లో వాదోపవాదాలు, విమర్శలు అంతా సహజసిద్ధంగా జరిగిపోతూ ఉంటాయి.కలిసి జట్టుగా ఉన్నప్పుడు ఒకలా ఒకలిసి లేనప్పుడు ఒకలా మాట్లాడటం కామన్ విషయమే.
అయితే మధ్యలో వీపీలు అయ్యేది మాత్రం ఒక పార్టీకి మద్దతు ఇస్తూ మరొక పార్టీని విమర్శించే వాళ్ళే.ఇరు పార్టీల అధినేతలు మాత్రం సులువుగా కలిసిపోయినా మధ్యలో కొంతమంది వ్యక్తులే బకరాలు అయ్యేది.
ఇప్పుడు ఇదే పరిస్థితి మెగా బ్రదర్ నాగబాబు కి ఎదురయ్యేలా ఉండనే వాదనలు వినిపిస్తున్నాయి.అప్పట్లో అన్న కోసం అలా.ఇప్పుడు తమ్ముడి కోసం ఇలా తన పరువు పోగొట్టుకోవడం అవసరమా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఇప్పుడు నాగబాబు పరువు పోగొట్టుకునేలా ఏమి జరిగింది అనేకదా.
సరే ఆ వివరాలలోకి వెళ్తే.నాగబాబు గారికి మైండ్ బ్లాక్ అయ్యి , కళ్ళు బైర్లు కమ్మి, దిక్కుతోచని స్థితికి వెళ్ళిపోతాడెమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.
ప్రజారాజ్యం పెట్టిన సమయంలో కూడా నాగబాబు తెగ హడావిడి చేసేసి కాంగ్రెస్ పార్టీపై వీర లెవిల్ లో విమర్శలు చేశారు.ఆ తరువాత చిరు కాంగ్రెస్ తో జట్టుకట్టడంతో నాగబాబు కి పెద్ద షాకే తగిలింది.ఇప్పటి వరకూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ,కాంగ్రెస్ జట్టుతో ఎలాగా మసిలేది అంటూ సైలెంట్ అయ్యాడు.
మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ లో తమ్ముడికి మద్దతుగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే అన్న ఇచ్చిన షాకు కి కొనసాగింపుగా ఈ సారి తమ్ముడు నాగబాబు కి షాక్ ఇవ్వనున్నాడట.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పని చేసేవిధంగానే పవన్ తీరు ఉందని.ఎలాగో అవినీతి మనయమైన వైసీపీ తో కలవడని, ఇప్పటి వరకూ పార్టీని పూర్తీ స్థాయిలో నిర్మాణం కూడా చేయలేని పవన్ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మద్దతుతోనే బరిలోకి దిగుతాడని విశ్లేషకులు దాదాపు ఒక అంచనాకి వచ్చేశారు.
నిజంగా పవన్ టీడీపీ తో జట్టు కడితే మళ్ళీ నాగబాబు బకరా అయినట్టే.ఊహించని షాక్ తగిలినట్టే అంటున్నారు.మరి నాగబాబు కి తమ్ముడు షాక్ ఇస్తాడో లేదా టీడీపీ పై మరిన్ని విమర్శలు చేయిస్తాడో వేచి చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy