ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి లీకైన డైలాగ్..

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఓ పక్క రాజకీయాల్లో రాణిస్తూనే .

మరో పక్క సినిమాల్లోనూ జోరు చూపిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .

ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలపై భారి అంచనాలు ఉన్నాయి .ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ పై( Ustad Bhagat Singh ) అభిమానులు ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు .గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్( Director Harish Shankar ) దర్శకత్వంలో పవన్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు.

ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ఇప్పటికే మొదలు పెట్టారు.హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్నారు.

అలాగే మిగిలిన షెడ్యూళ్లను కూడా పక్కా ప్లాన్‌తో చేసుకుంటూ ముందుకు వెళ్లాలను కుంటోన్నారు.ఈ గ్యాప్‌లో ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు చిత్ర యూనిట్ అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ఇస్తోంది.

Advertisement

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.ఇక ఇందులో కొందరు రాజకీయ నాయకులను టార్గెట్ చేసి.

తన డైలాగులతో వాళ్లపై దండయాత్ర చేస్తాడని అంటున్నారు.అందులో భాగంగా ఒక డైలాగ్ కూడా లీక్ అయింది.

అదేంటంటే రౌడీ పవన్ కళ్యాణ్ తో జనానికి సేవ చేయడానికి నువ్వేమన్న గాంధీవా భగత్ సింగ్ వా అనగానే హీరో గాంధీ భగత్ సింగ్ కాదు రా అంతకు మించి భగవంతుణ్ణి రా అంటాడు.ఈ డైలాగ్ ఇప్పుడు నెట్ లో బాగా వైరల్ అవుతుంది ఇక దీనితో పాటు ఈ ఇందులో సీన్స్ కొన్ని ఏపీ రాజకీయాలపై పరోక్షంగా ప్రస్తావించినట్లుగా ఉంటాయని తెలుస్తోంది.దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయని చెప్పాలి.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది.దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఇది తేరీ మూవీకి రీమేక్‌గా రూపొందుతోంది.ఇందులో అశుతోష్ రాణా, గౌతమి వంటి వారు నటిస్తున్నారు.

Advertisement

ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందన్న అంచనాలు ఆడియెన్స్ లోను నెలకొన్నాయి.ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

తాజా వార్తలు