అన్ని సినిమాలు కూడా ఎన్నికల తర్వాతేనే పవన్‌...?

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ( Pawan Kalyan )అభిమానులు ఆయన చేస్తున్న రాజకీయం పట్ల సంతృప్తి తో ఉన్నారు.

కానీ ఆయన సినిమా ల విషయం లో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఆయన క్రిష్ దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా ను ప్రారంభించాడు.ఇక హరీష్ శంకర్ దర్శకత్వం లో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా( Ustaad Bhagat Singh ) ను చేసేందుకు సైన్ చేసి కొంత మేరకు షూటింగ్ కూడా ముగించడం జరిగింది.

ఇక మధ్య లో సాహో సుజీత్‌ దర్శకత్వం లో ఓజీ( OG ) అనే సినిమా ను కూడా ప్రారంభించాడు.ఆ సినిమా ఎంత వరకు వచ్చింది అనేది క్లారిటీ లేదు.ఈ ఏడాది లో ఓజీ విడుదల చేయడం నూరు శాతం పక్కా అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు అన్నారు.

కానీ సినిమా షూటింగ్‌ పూర్తి గా ఆగిపోయింది.చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయినప్పటి నుంచి రాజకీయంగా పవన్ చాలా బిజీ అయ్యాడు.

Advertisement

తెలుగు దేశం పార్టీ తో కలిసి పోయేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నాడు. టీడీపీ ( TDP )తో కలిసి వెళ్తేనే వర్కౌట్‌ అవుతుందని జనసేన నాయకులు మరియు కార్యకర్తలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే తెలుగు దేశం పార్టీ తో జనసేన పార్టీ వెళ్లబోతుంది.

ఇక పార్టీ నాయకుల తో భేటీ లు ఇతర విషయా ల కోసం పవన్‌ ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు.అందుకే సినిమా లకు ఎక్కువ సమయం కేటాయించడం లో పవన్ విఫలం అవుతున్నాడు.

అందుకే పవన్‌ కళ్యాణ్ సినిమా లు ఈ ఏడాది లో లేనట్లే.వచ్చే ఏడాది ఎన్నికల వరకు వెయిట్‌ చేయాల్సిందే అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు అంటున్నారు.ఒక వేళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పవన్ కీలక బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

అదే జరిగితే ఈ సినిమా లు ఏమయ్యేనో అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు