కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై పవన్ ప్రశంసలు.. ఆ దర్శకుడి డైరెక్షన్ లో నటిస్తాడా?

గత కొద్దిరోజులుగా తెలుగు రాజకీయాలలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో పవర్ స్టార్,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy CM Pawan Kalyan )పేరు కూడా ఒకటి.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో డిప్యూటీ సీఎం గా తన పనులను తన విధులను నిర్వహిస్తూనే మరొకవైపు అంగీకరించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తున్నారు పవన్‌ కల్యాణ్‌.

మరొకవైపు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి దీక్షలు పూజలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ఒక తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోలీవుడ్‌లో( Kollywood ) తనకు నచ్చిన దర్శకుడు, కమెడియన్‌ గురించి మాట్లాడారు.

ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎవరి గురించి మాట్లాడారు అన్న విషయానికి వస్తే.ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.

కమెడియన్‌ యోగిబాబు( Comedian Yogi Babu ) అంటే ఇష్టం.ఇటీవల ఆయన నటించిన ఒక సినిమా చూశాను.

Advertisement

అందులో సర్పంచిగా యోగి నటన బాగుంది.బాగా నవ్వుకున్నాను.

దర్శకుల విషయానికొస్తే.నాకు మణిరత్నం సినిమాలంటే ఇష్టం.

అలాగే లోకేశ్‌ కనగరాజ్‌ ( Lokesh Kanagaraj )ఫిల్మ్‌ మేకింగ్ నచ్చింది.ఆయన దర్శకత్వంలో వచ్చిన లియో, విక్రమ్‌ సినిమాలు చూశాను.

బాగున్నాయి అంటూ ప్రశంసించారు.దీంతో పవన్‌ లోకేశ్‌ కనగరాజ్‌ ల కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుండని అభిమానులు అనుకుంటున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

కానీ, పవన్‌ ప్రస్తుతానికి రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.గతంలో అంగీకరించిన ప్రాజెక్ట్‌ లను మాత్రమే పూర్తి చేయనున్నారు.ఇలాంటి సమయంలో కొత్త సినిమా అంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి అని చెప్పాలి.

Advertisement

కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది.అవి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు.ఇవి అన్ని కూడా సెట్స్ పై ఉన్నాయి.

వీటిలో మొదట హరిహర వీలమళ్లు సినిమాను పూర్తి చేయనున్నారు పవన్ కళ్యాణ్.

తాజా వార్తలు