జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) తొలి బహిరంగ సభ కత్తిపూడిలో వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైయస్ జగన్( YS Jagan ) ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నారు.
అయితే ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాక మాట మార్చి మూడు రాజధానులు అని నాటకాలు ఆడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.జనసేన దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి యే అని స్పష్టం చేయడం జరిగింది.
వైసీపీ నాయకులు అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చడం వల్ల రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అనేక నష్టాలు ఎదుర్కొన్నారు అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.వైసీపీ నాయకులు అమరావతి ఒక్క కులానికి రాజధాని అని కల్లబొల్లి కబుర్లు చెప్పవచ్చు.కానీ అమరావతిలో అన్ని కులాలు వాళ్లు ఉన్నారు.
ఈ రకంగా అధికారంలోకి వచ్చి కొత్తగా మూడు రాజధానులు అని మరో నినాదం ఎత్తుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో వెనక్కి నెట్టేశారు.ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు చాలామంది మరణించడం జరిగింది అని పవన్ కళ్యాణ్ వారాహి విజయాత్ర తొలి బహిరంగ సభలో కత్తిపూడిలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy