Pawan Kalyan OG : ఓజీ సినిమాలో మూడు గెటప్ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. లీడర్ గెటప్ వేరే లెవెల్ అంటూ?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనందరికి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు.

అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్.రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఆయన చేస్తోన్న సినిమాల్లో ఓజీ సినిమా( OG Movie ) కూడా ఒకటి.ఆ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.

దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.కాగా ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే.

Pawan Kalyan Plays Three Different Getups In Og Movie
Advertisement
Pawan Kalyan Plays Three Different Getups In Og Movie-Pawan Kalyan OG : ఓజ�

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.తరచూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఓజీ మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయింది.అప్పటి నుంచి కొద్ది రోజుల వ్యవధిలోనే యాభై శాతం వరకూ టాకీ పార్ట్ పూర్తైంది.

ఇక, ఇప్పుడు పవన్ డేట్స్ ఇవ్వని కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది.త్వరలోనే మిగిలిన దాన్ని పూర్తి చేసి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయాలని చూస్తున్నారు.

Pawan Kalyan Plays Three Different Getups In Og Movie

కాగా ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.ఓజీ మూవీలో పవన్ కల్యాణ్ ఒక సాధారణ వ్యక్తి గ్యాంగ్‌స్టర్‌గా మారి ఆ తర్వాత రాజకీయ నాయకుడు అవడం చూపిస్తారట.ఇందులో యంగ్ ఏజ్‌లో ఒకలా, గ్యాంగ్‌స్టర్‌గా మారిన తర్వాత ఇంకోలా, పొలిటికల్ లీడర్‌గా మరోలా పవన్ కనిపిస్తాడని అంటున్నారు.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన వెంటనే పవన్ కల్యాణ్ OG మూవీ షూట్‌లో పాల్గొంటాడని తెలిసింది.అప్పుడే మిగిలిన రెండు గెటప్‌లకు సంబంధించిన షూటింగ్ జరపబోతున్నారట.

Advertisement

ఈ రెండూ సినిమాలో చూసినప్పుడు ఫ్రెష్‌గా ఉండడం కోసం వాటిని లీక్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకోబోతుందని అంటున్నారు.

తాజా వార్తలు