Pawan Kalyan vs Vijay : విజయ్ సినిమా కంటే పవన్ సినిమా హిట్.. ఆయన కామెంట్లతో ఫ్యాన్ వార్ మొదలైందిగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఖుషి సినిమా ఒకటి.ఎస్.

జె.సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఖుషి సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించారు.

ఈతరం ప్రేక్షకులు సైతం పవన్ కళ్యాణ్ ను ఎంతగానో అభిమానిస్తారు.అయితే పవన్ కళ్యాణ్ కంటే ముందు తమిళంలో విజయ్, జ్యోతిక కాంబినేషన్ లో ఖుషి సినిమా( Kushi Movie ) తెరకెక్కింది.

అయితే తమిళ ఖుషి సినిమాతో పోల్చి చూస్తే తెలుగు ఖుషి మూవీ అంచనాలను మించి విజయం సాధించింది.కలెక్షన్ల విషయంలో సైతం తెలుగు ఖుషి టాప్ లో నిలిచిందనే సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ఈ రెండు సినిమాలకు ఎస్.జె.సూర్య( Director SJ Surya ) డైరెక్టర్ కావడంతో తాజాగా ఒక సందర్భంలో తమిళ ఖుషి, తెలుగు ఖుషి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.తమిళ ఖుషితో పోల్చి చూస్తే తెలుగు ఖుషి పెద్ద హిట్ కావడానికి పవన్ కళ్యాణ్ స్టార్ డమ్, మ్యానరిజం కారణమని ఆయన తెలిపారు.

ఎస్.జె.సూర్య కామెంట్ల వల్ల పవన్, విజయ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ మొదలైంది.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు.

జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుండటంతో పవన్ ప్రస్తుతం ఆ స్థానాలపై ఫోకస్ చేయడం గమనార్హం.

పవన్ భీమవరం, తిరుపతి( Tirupathi ) నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే పవన్ ఈ స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.2024 ఎన్నికల్లో జనసేన( Janasena ) సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.పవన్ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే, మినిష్టర్ అవుతారని నెటిజన్లు చెబుతున్నారు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters
Advertisement