సాయితేజ్ వస్తే గాజు బాటిల్ విసిరేశారు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఏపీలో ఎన్నికల ప్రచారాలు చివరి దశకు వచ్చాయి.నేటితో ఎన్నికల ప్రచారాలు ముగియనున్నాయి.

ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు ఆయా పార్టీ నేతలు.దీనితో ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి అంతా కూడా పిఠాపురం నియోజకవర్గం మీదే వుంది.ఈ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.

గత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఎన్నికలలో భీమవరం ,గాజువాక రెండు నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయారు.

Pawan Kalyan Made Intresting Comments About That Issue, Pawan Kalyan, Sai Dharam
Advertisement
Pawan Kalyan Made Intresting Comments About That Issue, Pawan Kalyan, Sai Dharam

ఈ సారి జనసేన పార్టీ ( Janasena party )బీజేపీ ,టీడీపీలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీలోకి దిగింది.దీనితో ఈ సారి పవన్ గెలుపు ఖాయమని జన సైనికులు భావిస్తున్నారు.పవన్ కల్యాణ్ కోసం పలువురు టాలీవుడ్ ప్రముఖులు పిఠాపురం వచ్చి ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

గతంతో పోలిస్తే ఈసారి పవన్ కళ్యాణ్ కు ఎక్కువ మద్దతు లభిస్తుండడంతో ఈసారి పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయం అని అంటున్నారు జనసేన నాయకులు.అలాగే మెగా ఫ్యామిలీ కూడా పవన్ కోసం జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

రీసెంట్ గా మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ ,వైష్ణవ తేజ్, సాయిధరమ్ తేజ్ ( Varun Tej, Vaishnava Tej, Saidharam Tej )ప్రచారంలో పాల్గొన్నారు.

Pawan Kalyan Made Intresting Comments About That Issue, Pawan Kalyan, Sai Dharam

అయితే సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అతనిపై బాటిల్ ను విసిరారు.కానీ అది గురి తప్పి పక్కన వున్న తెలుగు దేశం కార్యకర్తకు తగిలింది.ఈ విషయంపై స్పందించిన పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై, కార్యకర్తలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

సాయిధరమ్ తేజ్ నా మీద వున్న ప్రేమతో ప్రచారానికి వచ్చాడు.రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిపై దాడి చేస్తారా అదే బాటిల్ తలకి తగిలి ఉంటే ఏమై ఉండేది అని పవన్ మండిపడ్డారు.

Advertisement

అలాగే గాయపడిన తెలుగు దేశం వ్యక్తి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.

సాయి ధరంతేజ్ నాకోసం ప్రచారాల్లోకి వస్తే ఎవరో గాజు బాటిల్ తో విసిరారు.ఆల్రెడీ దెబ్బతిన్న వ్యక్తికి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్.

కానీ దురదృష్టవశాత్తు ఆ గాజు బాటిల్ పక్కనే ఉన్న టిడిపి కార్యకర్తలు తగిలింది.ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న అతనికి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు