పవన్‌ కళ్యాణ్‌ లాంగ్‌ మార్చ్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఉద్యమం చేసేందుకు సిద్దం అయ్యారు.

విశాఖపట్నంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన లాంగ్‌ మార్చ్‌ కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొనబోతున్నారు.

దాదాపు పది లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత కారణంగా రోడ్డున పడ్డారు.వారందరికి మద్దతుగా జనసేన పార్టీ గత కొన్ని రోజులగా ఆందోళనలు చేస్తూనే ఉంది.

ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న జనసేన పార్టీ వైజాగ్‌లో భారీగా కార్యక్రమాన్ని తలపెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా జనసేన పార్టీ నాయకులు కోరుతున్నారు.

ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచే వరకు ప్రభుత్వం నుండి ఏదో ఒక హామీ వచ్చే వరకు ఈ ఉద్యమం సాగుతుందని జనసైనికులు అంటున్నారు.భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే వారి గురించి పట్టించుకోని ప్రభుత్వం ఏదో పథకాలు అంటూ తీసుకు వస్తుందని జనసేన పార్టీ కార్యకర్తలు ఎద్దేవ చేస్తున్నారు.

Advertisement

వైజాగ్‌లో పవన్‌ కళ్యాణ్‌ చేయబోతున్న లాంగ్‌ మార్చ్‌తో ప్రభుత్వం మెడలు వంచాలంటూ ఈ సందర్బంగా జనసైనికులు పిలుపునిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు