పవన్ వ్యూహాత్మక నిర్ణయం.. ఆస్థానంలో గెలుపు పక్కా..??

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి సిద్దంగా ఉన్నారు.తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ కి చావు దెబ్బ తగలటంతో.

ఏపీలో ఉన్న వైసీపీ , జనసేన పార్టీలకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.దాంతో ఈ ఊపుని కంటిన్యూ చేయడానికి పవన్ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లనున్నారట.

అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ముందుగా తన ఆస్థానం పై దృష్టి పెట్టారని తెలుస్తోంది.

ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి రెండు స్థానాల నుంచీ పోటీ చేశారు.దానిలో ఒకటి సొంత ఊరు పాలకొల్లు కాగా ,రెండోది తిరుపతి అయితే అనూహ్యంగా మెగా ఫ్యామిలీ కి సొంత ఊరి ప్రజలు షాక్ ఇవ్వడం అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు పవన్ ఆ స్థానం నుంచీ ఎలా అయినా సరే గెలుపుని దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారట.అందుకు వ్యుహాలని కూడా సిద్డం చేశారని తెలుస్తోంది.

Advertisement

అయితే పాలకొల్లు లో జనసేన జెండా ఎగరేయడానికి పవన్ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.అనే వివరాలలోకి వెళ్తే.

జనసేన కి పాలకొల్లు లో గెలుపు అంత వీజీ కాదని అంటున్నారట.టీడీపీ పై అక్కడి ప్రజలకి ఎలాగో నమ్మకం పోయింది.

స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వైఖరితో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని టీడీపీ సొంత మీడియానే చెప్పడంతో ఇక ఆస్థానం నుంచీ టీడీపీ అవుట్ అయినట్టే అయితే ఇక మిగిలింది వైసీపీ , జనసేన పార్టీల మధ్యే పోటీ నెలకొంది.పాలకొల్లు లో వైసీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్.

బాబ్జీ గారిని దాదాపు ఖరారు చేసినట్టే తాజాగా ఆయనతో కూడా వైసీపీ నేతలు సంప్రదింపులు జరిపారట.ఆయనే గనుక వైసీపీ పార్టీ అభ్యర్ధిగా ఎంపిక అయితే విజయం వరిస్తుందని అంటున్నారు విశ్లేషకులు.మరి

ఈ పరిస్థితుల్లో పవన్ పాలకొల్లు గెలుపుపై ఎలాంటి వ్యుహాలని అవలంభిస్తారు అనేది సస్పెన్స్ గా మారింది.ఇతర పార్టీ అభ్యర్ధుల బలాబలాలతో సంభంధం లేకుండా తనదైన శైలిలో ఎంతో వ్యూహాత్మకంగా వెళ్తున్నారని తెలుస్తోంది.ఇప్పటికే ఈ విషయంపై పార్టీ సీనియర్స్ తో చర్చలు జరిగాయట దాదాపు పక్కా ప్రణాళికతోనే పవన్ పాలకొల్లు పై పట్టు సాధించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

Advertisement

మరి ఏమిటా ప్రణాళిక.?? ఎలాంటి వ్యుహాలని అమలు చేయనున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు జనసేన నేతలు.

తాజా వార్తలు