నన్ను బ్లేడ్ లతో కట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.కాకినాడలో మాట్లాడుతూ.

నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయి.వారు సన్న బ్లేడ్ లు( Blades ) తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారు.

ప్రత్యర్ధి పార్టీల పన్నాగాలు తెలుసు కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి.అందుకే మనం ప్రోటోకాల్ పాటించాలి.

నన్ను కలిసే వారందరితో ఫోటోలు దిగటానికి నేను సిద్ధం అని అన్నారు.రోజుకి కనీసం 200 మందితో ఫోటో దిగేలా ఏర్పాట్లు చేస్తున్నా.పిఠాపురంలో( Pithapuram ) అన్ని మండలాలను త్వరలో పర్యటించబోతున్న.54 మండలాలలో ఏదో ఒక గ్రామంలో స్థిర నివాసం కూడా తీసుకోబోతున్న.కాబట్టి భద్రతా కారణాల దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా.

Advertisement

నాకు ఏదైనా అవసరం ఉంటే ఎవరిని చేయిచాచి అడిగే గుణం లేదు.కానీ ఒకసారి నా సినిమాలు( Movie Flops ) వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పుడు.ఫ్యాన్స్ భాదపడుతున్నపుడు భగవంతుని విజయం ప్రసాదించమని అడిగా.

తర్వాత సినిమాలు విజయాలు అందుకున్నాయి.అలాగే భీమవరం( Bhimavaram )లో ఓడిపోయినప్పుడు అభిమానులు, కార్యకర్తలు బాధపడిన సమయంలో.

ఈసారి గెలిపించామని భగవంతుని కోరుకుంటే పిఠాపురం నన్ను పిలిచింది.ఈసారి ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న.

నాతో పాటు కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్( Kakinada MP Candidate Uday ) నీ గెలిపించండి.నాకు అందరితో మాట్లాడాలని ఉంటది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

కాకపోతే భద్రతా కారణాల దృష్ట్యా ప్రోటోకాల్ పాటించాలి.కాబట్టి అందరూ సహకరించండి అని పవన్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

ఈ క్రమంలో పిఠాపురంలో వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు జనసేనలో చేరడం జరిగింది.వారందరినీ పార్టీలో ఆహ్వానించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు