సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) ప్రస్తుతం తన కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మధ్య కాలంలో వెంకీ మామ సినిమాలకు ఎప్పుడు లేనంత హైప్ ఈ సినిమాకు క్రియేట్ అయ్యింది.
వెంకీ మామ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియెన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.మరి ఆ సినిమానే సైంధవ్.
వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సైంధవ్( Saindhav )ఈ సినిమాతో వెంకటేష్ కూడా ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి రేసులో నిలుపుతున్నారు.
హిట్ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను( Director Sailesh kolenu ) ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో ఈసారి వెంకీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ఒక సాలిడ్ క్రేజీ బజ్ వైరల్ అవుతుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకు రాబోతున్నారంటూ పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
కాగా వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్ న( Shraddha Srinath )టిస్తుండగా.
ఆండ్రియా, రుహనీ శర్మ కూడా కీ రోల్స్ పోషిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy