జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ విమర్శల డోసు పెంచారు.
రాజకీయంగా మరింత ముందుకు వెళ్లి ప్రజల నోటిలో నానాలంటే పదునైన విమర్శలతో పాటు పెద్ద తలకాయలు టార్గెట్ చేసుకోవాలి అనుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు పవన్ కన్ను నందమూరి బాలకృష్ణ పై పడింది.
ఆయన మీద డైరెక్ట్ గా విమర్శలు చేయకుండానే తన రాజకీయ చతురతను చూపించాడు.ఇంతకీ పవన్ ఎందుకు అలా అన్నాడు.? ఆ సందర్భం ఎందుకు వచ్చింది అంటే.దానికి కూడా ఒక రీజన్ ఉంది.
మంగళవారం గోదావరి జిల్లా బీమవరం ఆక్వా రైతుతో పవన్ కళ్యాణ్ సమావేశమైన విషయం తెలిసిందే.ఆ సమయంలోనే బాలకృష్ణపై పవన్ విమర్శలు చేశారు.
ఇంట్లో తుపాకీతో కాల్చిన వారు ఇప్పుడు బయట తిరుగుతున్నారని, పోలీసులు వాళ్లను మాత్రం పట్టించుకోవడం లేదని పవన్ కల్యాణ్ సంచలన విమర్శలు చేశారు.భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైన ఆయనను జనసేన పార్టీ కార్యకర్తలు కలిశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
తాము ఊళ్లల్లో బైక్‌ల మీద తిరుగుతుంటే.పోలీసులు అడ్డుకుంటున్నారని, అక్రమ కేసులను తమపై బనాయిస్తున్నారని పవన్‌తో చెప్పుకున్నారు.
దీనిపై స్పందించిన ఆయన ఓ ర్యాలీలో బైక్ సైలెన్సర్లు తీసేసి భారీ రొద చేసిన విషయంలో పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.జనసేన సైనికులు బైక్ సైలెన్సర్ తీసి శబ్దం చేస్తే అదేదో పెద్ద నేరం చేసినట్లు చూస్తున్నారని ఆరోపించిన ఆయన, ఇంట్లో తుపాకీతో కాల్చి బయట తిరుగుతున్న వాళ్లను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
బాలకృష్ణ ఇంట్లో తుపాకీ కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఆ సమయంలో ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ తీవ్రంగా గాయపడ్డారు.
అదే విషయాన్ని పవన్ పరోక్షంగా ప్రస్తావించారు.ఈ విషయాన్నే పేర్కొంటూ జనసేన మీడియా హెడ్ హరి ప్రసాద్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy