Pawan Kalyan Director Sujeeth : పవన్ ఫ్యాన్స్ కొత్త డిమాండ్.. సుజీత్ ప్రాజెక్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా అతడే కావాలట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ తన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు తో బిజీగా ఉన్నారు.

ప్రెజెంట్ ఈ సినిమా షూట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది అని టాక్.

ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమా గత రెండేళ్లుగా సెట్స్ మీదనే ఉంది.

వివిధ కారణాల వల్ల షూట్ వాయిదా పడుతూ వస్తుంది.ఇక ఎట్టకేలకు ఈ సినిమా పూర్తి చేసే పనిలో పవన్ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా చేస్తూనే పవన్ కళ్యాణ్ మరొక కొత్త సినిమాను ప్రకటించాడు.హరిహర వీరమల్లు తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ ఈయన ఈ సినిమాను హోల్డ్ లో పెట్టి కొత్త సినిమా ప్రకటించాడు.

Advertisement

అయితే ఈ సినిమా అలా ప్రకటించారో లేదో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.దిగ్గజ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటెర్టైనమెంట్స్ నుండి సుజీత్ తో పవర్ స్టార్ సినిమా ఉంది అనే క్రేజీ అనౌన్స్ మెంట్ రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి చాలా కాలం తర్వాత ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది.

ఈ సినిమాపై ఫ్యాన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా పెడుతూ ఉత్తమ నటీనటులను, సిబ్బందిని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంగీత డైరెక్టర్ విషయంలో కూడా పవన్ ఫ్యాన్స్ నుండి ఒక డిమాండ్ వినిపిస్తుంది.

ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచందర్ ను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో అభ్యర్థిస్తున్నారు.సోషల్ మీడియాలో డివివి వి వాంట్ అనిరుద్ ఫర్ ఓజి అనే ట్యాగ్ లైన్ ట్రెండ్ చేస్తున్నారు.ఈ ట్యాగ్ లైన్ తో ఇప్పటి వరకు 40,000 కంటే ఎక్కువ ట్వీట్లు చేయబడ్డాయి అంటేనే ఫ్యాన్స్ ఈయనను ఎంత కోరుకుంటున్నారో అర్ధం అవుతుంది.

చూడాలి మేకర్స్ ఈ విషయాలను కన్సిడర్ చేస్తారో లేదో.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు