పిఠాపురంలో భారీ ఆస్తులను కొన్న డిప్యూటీ సీఎం పవన్!

సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీ( Janasena Party ) ని స్థాపించి రాజకీయాలలోకి అడుగు పెట్టారు.

ఇలా జనసేన పార్టీ తరఫున ఈయన గత ఎన్నికలలో పిఠాపురం( Pitapuram ) నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నారు.  ఇలా నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ రాజకీయాలలో కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకున్నారు.

ప్రస్తుతం రాజకీయాల పరంగా తన బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.అయితే రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్ సినిమా పనులను కాస్త పక్కన పెట్టడంతో అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు బిగ్ స్క్రీన్ పై చూస్తామా అంటూ ఆరాట పడుతున్నారు.ఈయన కమిట్ అయిన సినిమాల షూటింగ్ పనులు ఆగిపోయాయి.

పవన్ కళ్యాణ్ కు వీలైనప్పుడు ఈ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.పవన్ కళ్యాణ్ పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు అయితే ఈయన ఎన్నికల సమయంలో తాను కూడా ఇక్కడే నివాసం ఉంటానని తెలిపారు.అందుకు అనుగుణంగానే ఈయన తాజాగా పిఠాపురంలో 12 ఎకరాల పొలం కొనుగోలు చేశారని అక్కడే ఆయన ఇంటితో పాటు పార్టీ క్యాంప్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఈ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా నిన్నటితో పూర్తి అయ్యాయి.ఈ వ్యవహారాలన్నింటినీ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ విధులను నిర్వహిస్తున్నారు, త్వరలోనే పిఠాపురంలో ఈయన సొంత ఇంటిని అలాగే పార్టీ ఆఫీసును కూడా నిర్మించబోతున్నారని తెలుస్తోంది.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు