జ‌గ‌న్ పాద‌యాత్ర టార్గెట్‌గా ప‌వ‌న్‌

జ‌న‌సేన అధినేత ఫుల్ టైం పొలిటిషీయ‌న్‌గా ప్ర‌జాక్షేత్రం అడుగుపెట్టే టైం ఫిక్స్ అయ్యింది.

ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో ప‌నిచేస్తోన్న ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత ద‌స‌రా నుంచి త‌న టైంను పూర్తిగా రాజ‌కీయాల‌కు స్పెండ్ చేయ‌నున్నాడు.

అక్టోబ‌ర్ నుంచి ప‌వ‌న్ ర‌థ‌యాత్ర ప్రారంభంకానుంది.ఇందుకోసం ప్ర‌త్యేకంగా జ‌న‌సేన బ‌స్సు కూడా రెడీ అవుతోంది.

సక‌ల సౌక‌ర్యాలు ఉన్న ఈ బ‌స్సులో ప‌వ‌న్ ఒకేసారి అన్ని జిల్లాల్లోను ప‌ర్య‌టించ‌నున్నాడు.తాజాగా ఉద్దానం స‌మ‌స్య‌పై మాట్లాడేందుకు చంద్రబాబును క‌లిసిన ప‌వ‌న్ అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకే తాను ఈ బ‌స్సు యాత్ర చేప‌డుతున్న‌ట్టు తెలిపారు.ముందు పాద‌యాత్ర చేయాల‌ని అనుకున్నా భ‌ద్ర‌తా కారాణాల దృష్ట్యా ప‌వ‌న్ త‌ర్వాత పాద‌యాత్ర మానుకుని బ‌స్సు యాత్ర‌కు రెడీ అవుతున్నారు.

జ‌గ‌న్‌కు పోటీగానే ప‌వ‌న్ బ‌స్సుయాత్ర :

ప‌వ‌న్ బ‌స్సుయాత్ర జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పోటీ కానుంది.జగన్ పాదయాత్ర అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానుంది.

Advertisement

జగన్ కు పోటీగానే పవన్ ఈ రోడ్ షోలను నిర్వహిస్తారా ? అన్న చర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రారంభ‌మైంది.ప‌వ‌న్ రోడ్ షోల‌ను ప్రారంభిస్తున్నాన‌ని చెప్ప‌డం, జ‌గ‌న్ పాద‌యాత్ర‌లు ప్రారంభ‌మ‌వుతోన్న నెల‌నే ఎంచుకోవ‌డం చూస్తుంటే జ‌గ‌న్‌ను టార్గెట్ చేసేందుకు ప‌వ‌న్ యాత్ర‌లు ప్రారంభ‌మ‌వుతున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల టాక్‌.

ఇక ముద్ర‌గడ పాద‌యాత్ర‌పై స్పందించిన ప‌వ‌న్ గ‌తంలో జ‌రిగిన విధ్వంస ఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ముద్రగడ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతిచ్చి పోక ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ఇక నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కూడా తాను ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇచ్చే అంశాన్ని రెండు రోజుల్లో వెల్ల‌డిస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు.

ఓవ‌రాల్‌గా చూస్తే చంద్ర‌బాబును క‌లిశాక ప‌వ‌న్ టోన్ మారిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.కొద్ది రోజుల్లో జ‌రిగే నంద్యాల ఉప ఎన్నిక‌తో పాటు 2019 ఎన్నిక‌ల్లో కూడా జ‌న‌సేన‌+టీడీపీ క‌లిసి పోటీ చేసే అవ‌కాశాలే పుష్క‌లంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఏదేమైనా 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ టీడీపీని వీడినా టీడీపీ+జ‌న‌సేన క‌లుస్తాయ‌న్న ఓ క్లారిటీ వ‌చ్చింది.

Advertisement

తాజా వార్తలు