Aarthi Agarwal : పవన్ కళ్యాణ్ – ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో కొన్ని సినిమాలు మిస్ అయ్యాయని తెలుసా మీకు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు.

వరుస సినిమాలు ప్లాప్ లు అయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అనే చెబుతుంటరు.మెగా స్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్నారు.

అయితే ఇండస్ట్రీలో చాలా మందితో పవన్ కళ్యాణ్ వర్క్ చేసారు.పవన్ కళ్యాణ్ తో నటించాలని ఏ హీరోయిన్ కి అయినా ఉంటుంది.

ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటుంటారు.అయితే పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ ఉన్నా ఆ అవకాశాన్ని ఒక హీరోయిన్ మిస్ చేసుకుందట.

Advertisement

ఆమె ఎవరో కాదు ఆర్తి అగర్వాల్( Aarthi Agarwal )మరి పవన్ ఆర్తి కాంబినేషన్ లో మిస్ అయినా సినిమాలు ఏంటో చూద్దాం.

పవన్ కళ్యాణ్ కరుణాకరన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బాలు( Balu )ఈ సినిమా సినిమా కమర్షియల్ గా యావరేజి అయ్యినప్పటికీ ఇప్పటికి చాలా మంది ఫేవరెట్ సినిమా అంటుంటారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా శ్రేయ నటించారు.అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ తో వచ్చే హీరోయిన్ క్యారెక్టర్ అప్పట్లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.

సినిమా విడుదలయ్యాక ఆ పాత్ర గురించే మాట్లాడుకున్నారు.అయితే ఈ పాత్ర కోసం ముందు ఆర్తి అగర్వాల్ ని అడిగారట.

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఆర్తి అగర్వాల్ గంతులేసింది.ఎన్నో ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేయాలని ఉంది, ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా అని కూడా చెప్పింది.అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే ముందుగా షూటింగ్ జరపాల్సి వచ్చిందట.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

దీంతో ఆర్తి అగర్వాల్ కు ఆ డేట్స్ ఫిక్స్ కాలేదు.అందువల్ల ఆర్తి అగర్వాల్ బాలు సినిమాని అయిష్టంతోనే వదులుకోవాల్సి వచ్చింది.

Advertisement

కొన్నిసార్లు ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.

తాజా వార్తలు