పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి సినిమా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

పవన్ కళ్యాణ్ హీరోగా ఆమద్య వరుసగా నాలుగు సినిమా లు బ్యాక్ టు బ్యాక్ ప్రకటన వచ్చాయి.అందులో వకీల్‌ సాబ్‌ సినిమా విడుదల అయ్యింది.

భీమ్లా నాయక్ ఆ సమయంలో ప్రకటించకున్నా కూడా ఆ సినిమా చేయడం జరిగింది.విడుదల చేయడం కూడా జరిగింది.

ఇక క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాను ప్రకటించారు.ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.

కరోనా వల్ల చాలా ఆలస్యం అయ్యింది.అయినా కూడా అంచనాలు ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున అభిమానులు వీరమల్లు సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

Advertisement

ఇక హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌ సింగ్.ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాలేదు.

హరీష్ శంకర్ సినిమా తో పాటు సురేందర్‌ రెడ్డి సినిమా ను కూడా పవన్ కళ్యాణ్‌ కన్ఫర్మ్‌ చేయడం.దాన్ని రామ్‌ తాళ్లూరి నిర్మంచడం జరుగుతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది.

సురేందర్ రెడ్డి గత కొన్నాళ్లుగా ఏజెంట్‌ సినిమా తో బిజీగా ఉన్నాడు.ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.

ఆగస్టు లో సినిమా విడుదల కాబోతుంది.దాంతో పవన్ సినిమా విషయంలో శ్రద్ద పెడుతున్నట్లుగా తెలుస్తోంది.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

తాజాగా ఈ సినిమా గురించిన అప్‌డేట్‌ వచ్చింది.నిర్మాత రామ్‌ తాళ్లూరి సన్నిహితుల వద్ద ఈ సినిమాను ఆగస్టు లో లేదా సెప్టెంబర్‌ లో పట్టాలెక్కించబోతున్నట్లుగా ప్రకటించాడు.

Advertisement

వచ్చే ఏడాది సమ్మర్‌ లో పవన్‌ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఆయన చెప్పాడట.ఒక బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీని పవన్‌ కు జోడీగా సురేందర్‌ రెడ్డి ఎంపిక చేశారని.

అధికారిక ప్రకటన త్వరలో ఉంటుందని అంటున్నారు.మొత్తానికి సూరి మరియు పవన్ ల మూవీ అప్డేట్ రావడంతో అభిమానులు హ్యాపీ.

తాజా వార్తలు