జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కోస్తా పర్యటనతో భాగంగా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ బతికిపోయింది.
తన ప్రసంగాలలో భాగంగా పవన్ కళ్యాణ్ స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలపై మండిపడుతూ ప్రసంగాలు చేస్తుండగా వైసీపీ మార్గాలు ఏమాత్రం తగ్గకుండా పర్సనల్గా అటాక్ చేస్తున్నారు.
ఆయన వ్యక్తిగత జీవితం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మూడు పెళ్లిళ్లు. ప్రతిసారి కూడా ఆ విషయం గురించే ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.
మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన పవన్ కళ్యాణా? మహిళా సాధికారత గురించి మాట్లాడేది అంటూ అంబటి రాంబాబు, ద్వారంపూడి, పేర్ని నాని, కొడాలి నాని ఇలా ముఖ్యనేతలంతా పవన్ పై మండి పడుతున్నారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి అయితే ఒక అడుగు ముందుకేసి.పరిటాల రవి పవన్ కళ్యాణ్‌కి గుండు కొట్టించిన వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఒక రేంజ్‌లో సవాల్‌లు విసిరారు.ఇది ఇలా ఉంటే గతంలో ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లహరి( Lahari ) గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసిన లహరి పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని.అప్పట్లో పవన్ పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్‌ని( Kathi Mahesh ) స్టుడియో నుంచి పరుగులు పెట్టించింది.
ఈమె వ్యాఖ్యాతగా ఉన్న ఆ షోలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్‌ని పర్సనల్ ఎటాక్ చేయడంతో కౌంటర్ ఇచ్చింది లహరి.మీ తల్లిగారి పేరు ఏంటో చెప్పండి అని అడిగింది.
ఆ డిబేట్‌కి గెస్ట్‌గా వచ్చిన వివేక్ కూడా.మీ తల్లి పేరు అడుగున్నారు కదా చెప్పండీ అని పదే పదే కత్తి మహేష్ తల్లి గురించి అడిగారు.
అయితే సమాధానం చెప్పని కత్తి మహేష్ స్టుడియో నుంచి వెళ్లిపోయాడు.కాగా ఆ ఇంటర్వ్యూ అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది.పవన్ కళ్యాణ్‌ని దూషిస్తూ హాట్ టాపిక్ అవుతున్న కత్తి మహేష్ నోటికి తాళం వేసిన యాంకర్ లహరి ఆ దెబ్బతో సెలబ్రిటీ అయిపోయింది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లహరిని ఆకాశానికి ఎత్తేశారు.అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కవరేజ్‌కి వెళ్లింది లహరి.జనసేన జెండాని తన బండికి కట్టుకుని జనసైనికుల్లో ఉత్సాహం నింపింది లహరి.
ఆ సందర్భంలో పవన్ దృష్టిలో పడ్డ లహరి.పర్సనల్‌గా ఆయన్ని కలిసింది.
పవన్ కళ్యాణ్‌తో ఫొటోలు దిగడంతో అప్పట్లోనే అనేక రూమర్లు నడిచాయి.పవన్ కళ్యాణ్‌కి నాలుగో భార్య అంటూ పుకార్లు షికారు చేశాయి.
అయితే వీటిపై స్పందించిన లహరి.కత్తి మహేష్ ఇంటర్వ్యూతోనే తాను బాగా ఫేమస్ అయ్యానని ఆయనతో తనకి పర్సనల్ గొడవలేం లేవని లహరి తెలిపింది.
అయితే ఇంటర్వ్యూలో ఆయన అలా మాట్లాడటం తప్పనిపించింది అందుకే ఖండించానని చెప్పింది లహరి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy