దర్శకులతో పవన్ కళ్యాణ్ కి మూడో సినిమా అంటే ఫలితం ఇలా ఉంటుందా?

 తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో క్రేజ్ సంపాదించుకున్నాడు పవన్.కొన్నాళ్ళ పాటు సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల వైపు వెళ్ళాడు.

కొన్నాళ్ళ పాటు రాజకీయాల్లో కొనసాగి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు అని చెప్పాలి.వకీల్ సాబ్ అనే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

ఇక ఇటీవల భీమ్లా నాయక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే భీమ్లా నాయక్ సినిమా సూపర్హిట్ అవ్వగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఉన్న కొన్ని సెంటిమెంట్ లు ప్రస్తుతం తెరమీదికి వస్తూ ఉండడం గమనార్హం.

కాగా ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే.ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ 27 సినిమాలలో నటించాడు.

Advertisement
Pawan Kalyan 3rd Movie Sentiment, Pawan Kalyan , 3rd Movie , Bhimineni Srinivasa

ఇందులో హీరోగా నటించిన 25 సినిమా లో అయితే రెండు సినిమాల్లో కేవలం అతిథిగా మాత్రమే పరిమితం అయ్యాడు.ఇక పవన్ కళ్యాణ్ కెరీర్లో విజయం సాధించిన లిస్ట్ చూస్తే.

గోకులంలో సీత‌`, `సుస్వాగ‌తం`, `తొలిప్రేమ‌`, `త‌మ్ముడు`, `బ‌ద్రి`, `ఖుషి`, `జ‌ల్సా`, `గ‌బ్బ‌ర్ సింగ్`, `అత్తారింటికి దారేది`, `గోపాల గోపాల‌`, `వ‌కీల్ సాబ్`, `భీమ్లా నాయ‌క్ సినిమాలు ఉన్నాయి.

Pawan Kalyan 3rd Movie Sentiment, Pawan Kalyan , 3rd Movie , Bhimineni Srinivasa

ఇలా పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ అయిన 12 సినిమాలలో 7 కూడా ఆయా దర్శకులకు మూడో సినిమా కావడం గమనార్హం.శుభమస్తు, శుభాకాంక్షలు ఇలాంటి రెండు సినిమాల తర్వాత భీమినేని శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం తీసి హిట్ కొట్టాడు.వామి, ఖుషి తమిళ్ అనంతరం తెలుగులో ఖుషి సినిమా తీసి ఎస్ జె సూర్య పవన్తో హిట్ కొట్టాడు.

నువ్వే నువ్వే, అతడు లాంటి సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ తో జల్సా సినిమా తీసి మంచి హిట్టు ఖాతాలో వేసుకున్నాడు త్రివిక్రమ్.షాక్, మిరపకాయ తర్వాత హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

కొంచెం ఇష్టం కొంచెం కష్టం, తడాఖా లాంటి సినిమాల తర్వాత కిషోర్ కుమార్ పార్ధసాని గోపాల గోపాల పవన్ కళ్యాణ్ తో తీసి మంచి విజయాన్ని అందుకున్నారు.ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ తర్వాత వకీల్ సాబ్ తీసిన వేణు శ్రీరామ్ హిట్టయ్యాడు.

Advertisement

అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో సాగర్ కే చంద్ర భీమ్లా నాయక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

" autoplay>

తాజా వార్తలు