రేణు దేశాయ్ రెండో పెళ్లిపై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్.! ఫాన్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే.?

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

తనకు మరొక తోడు దొరికిందని, ఇపుడు జీవితం చాలా సంతోషంగా ఉందంటూ ఆమె ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫోటోను కొన్ని రోజుల క్రితం పోస్టు చేశారు.

తాజాగా రేణు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మరో ఆసక్తికర పోస్టు పెట్టారు.ఈ ఫోస్టు చేయడం ద్వారా తనకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని ఆమె అఫీషియల్‌గా ప్రకటించారు.

రేణూ రెండో పెళ్లికి కొందరు నెటిజన్లు మద్దతు పలుకుతుండగా.మరికొందరు పెళ్లి చేసుకోవద్దంటూ కోరుతున్నారు.

ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ తమ తమ సందేశాలను రేణుకు పంపిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.రేణు దేశాయ్ రెండో వివాహంపై ఆమె మాజీ భర్త, నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.

రేణు రెండో పెళ్లికి మద్దతు ప్రకటించారు.ఈ మేరకు ఇవాళ ట్వీట్టర్‌ ద్వారా స్పందించిన పవన్.

‘‘కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న రేణు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.అంతా మంచే జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.

ప్రకృతి తనకు సమృద్ధియైన ఆయురారోగ్యాలు, ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

మెరిసే చర్మం కోసం అరటిపండు పేస్ పాక్స్

పవన్ స్పందనపై ఇరువురి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రేణు దేశాయ్ ఎక్కడున్నా ఆమె మంచి కోరుకునే వ్యక్తి పవన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.రేణుని ఎందుకు వదిలేశారు.

Advertisement

ఇద్దరూ కలిసి ఉంటే బాగుండేదని మరికొందరు కోరుతున్నారు.

తాజా వార్తలు