వ్యూహం మార్చిన పవన్ ! టీడీపీ బెంబేలు 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వ్యూహం మార్చారు.

తన ఎన్నికల ప్రచారం వాహనం వారాహి( Varahi ) ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏపీ రాజకీయాన్ని మరింత వేడెక్కించే పనిలో నిమగ్నం అయ్యారు.

పవన్ వాడి వేడిగా తన ప్రసంగాలు చేస్తూ వైసిపి( YCP ) ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని,  ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తానని,  బాగా పనిచేయలేదని భావిస్తే తానే రాజీనామా చేస్తానంటూ పవన్ మాట్లాడుతున్నారు.

గతంలో టిడిపితో పొత్తు ఖాయమని, వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదు అంటూ ప్రకటనలు చేసిన పవన్ ఇప్పుడు మాత్రం ఆ సంగతిని ఎక్కడా ప్రస్తావించడం లేదు .

 అంతేకాదు సీఎం పదవి చేపట్టే అంత స్థాయి తనకు లేదు అని , ఆ కుర్చీపై అశలు పెట్టుకోవడం లేదని గతంలో మాట్లాడిన పవన్ ఇప్పుడు మాత్రం సీఎం గా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.పవన్ లో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పు టిడిపిలో( TDP ) కలవరం పుట్టిస్తుంది.గతంలో వైసీపీని ఓడించేందుకు సీఎం పదవిని కాదని పొత్తులకు సిద్ధమయ్యానని చెప్పుకున్న పవన్ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం వెనుక కారణాలు ఏంటనేది టిడిపి ఆరా తీస్తోంది.

Advertisement

ఈసారి అసెంబ్లీకి రాకుండా తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని చెబుతూనే , తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.అయితే ఎక్కడా పొత్తుల అంశాన్ని ప్రస్తావించడం లేదు.

తనకు అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు.పవన్ తన ప్రసంగాల్లో ఎక్కడా టిడిపి,  బిజెపి ప్రస్తావన తీసుకురావడం లేదు.

పొత్తుల పైన నిర్ణయం జరగలేదని చెబుతూ  , ఎన్నికల సమయంలోనే దానిపై నిర్ణయం తీసుకుంటామంటూ పవన్ మాట్లాడుతున్నారు.దీంతో పవన్ ప్రసంగాల పై టిడిపిలో చర్చ మొదలైంది.పవన్ వారాహి యాత్రకు ముందుగా అనేక సంస్థలతో సర్వేలు చేయించారని, అందులో జనసేన( Janasena ) బలంతో పాటు, టిడిపి, వైసిపి, బిజెపికి ప్రజల్లో ఉన్న బలం పై సర్వే రిపోర్టులు తెప్పించుకున్నారని , అందులో చాలా ప్రాంతాల్లో టిడిపి బలంగా లేదని తేలడంతోనే పవన్ వైఖరి లో మార్పు రావడానికి కారణంగా తెలుస్తోంది.

అందుకే టిడిపి చెప్పిన విధంగా తాను నడుచుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయంకి పవన్ వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.సొంతంగా జనసేన బలం పెంచుకుంటే ఎన్నికల సమయంలో పొత్తులకు వెళ్లినా, సీట్ల విషయంలో తమదే పై చేయి గా ఉంటుందనే అభిప్రాయంతో పవన్ ఉన్నారట.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

అందుకే తన ప్రసంగాల్లో టిడిపి , బిజెపి ప్రస్తావని తీసుకురాకపోయినా పొత్తు మాత్రం లేదని విషయాన్ని పవన్ ప్రకటించడం లేదు.

Advertisement

తాజా వార్తలు