రోజుకు ఐదు నిమిషాలు ఈ ఆస‌నం వేస్తే..పొట్ట చుట్టు కొవ్వు ప‌రార్‌!

పొట్ట చుట్టు కొవ్వు లేదా బెల్లీ ఫ్యాట్‌.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో వేధించే కామ‌న్ స‌మ‌స్య ఇది.

ఆహార‌పు అల‌వాట్లు, ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చుని ఉండ‌టం, మ‌ద్య‌పానం, హార్మోన్ ఛేంజ‌ెస్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ ఏర్ప‌డుతుంది.ఇక‌ పొట్ట చుట్టు కొవ్వు పేరుకు పోవ‌డం వ‌ల్ల దుస్తులు ప‌ట్ట‌క పోవ‌డ‌మే కాదు చూసేందుకు చాలా అస‌హ్యంగా క‌నిపిస్తారు.

అందుకే బెల్లీ ఫ్యాట్‌ను క‌వ‌ర్ చేసుకోలేక‌.త‌గ్గించుకోలేక‌.తెగ స‌త‌మ‌త‌మైపోతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆస‌నాన్ని ప్ర‌తి రోజు ఐదంటే ఐదు నిమిషాల పాటు వేస్తే గ‌నుక‌.కొద్ది రోజుల్లోనే పొట్ట చుట్టు పేరుకున్న కొవ్వు ప‌రార్ అయిపోతుంది.మ‌రి ఎందుకు లేటు ఆ ఆస‌నం ఏంటీ.? దాన్ని ఎలా వేయాలి.? వంటి విష‌యాల‌ను చూపు చూసేయండి.బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించే ఆస‌నం ఏదో కాదు `ప‌వ‌నముక్తాస‌నం`.

ఇది యోగాలో ఒక విధమైన ఆసనం.దీనిని ఎలా వేయాలంటే.

Advertisement

ముందుగా నేలపై వెల్లకిలా ప‌డుకుని.కాళ్లు తిన్నగా చాచి, భుజాలు నేలపై పరచాలి.

ఇప్పుడు దీర్ఘంగా శ్వాస పీల్చుకుని.ఆపై మోకాళ్ల‌ను వంచి రెండు చేతులతో గ‌ట్టిగా ప‌ట్టుకుని ఛాతీ వ‌ర‌కు తీసుకురావాలి.

అనంత‌రం మోకాలితో పొట్ట‌ను అద‌మి.శ్వాస‌ను మెల్ల‌గా వ‌దులుతూ చుబుకాన్ని మోకాళ్ల‌కు తాకించాలి.

ఈ స్థితిలో ఐదు నిమిషాలు ఉంటే గ‌నుక బోలెడ‌న్ని ఆరోగ్య లాభాల‌ను పొందొచ్చు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ముఖ్యంగా ప్రతి రోజు ప‌వ‌నముక్తాస‌నం వేయ‌డం వ‌ల్ల పొట్ట చుట్టు ఉన్న కొవ్వు క‌రిగి న‌డుము నాజూగ్గా మారుతుంది.అలాగే జీవ‌క్రియ చురుగ్గా మారి గ్యాస్‌, కడుపు ఉబ్బరం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.పేగులలోని అదనపు గాలి బయటకు వస్తుంది.

Advertisement

కీళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.మ‌రియు కండ‌రాలు గ‌ట్టిగా మార‌తాయి.

తాజా వార్తలు