మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షం చివరి రోజున అమావాస్య తిథి వస్తుంది.
ఈ క్రమంలోనే కొత్త సంవత్సరంలో జనవరి 2వ తేదీ ఆదివారం పుష్యమాస అమావాస్య వస్తుంది.
ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనది ప్రత్యేకమైనదిగా భావిస్తారు.ముఖ్యంగా ఈ అమావాస్య పితృదేవతల కోసం ఎంతో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు.
ఈ పుష్య అమావాస్య రోజున పితృ దోషం ఉన్న వారు కాలసర్ప దోషం ఉన్నవారు ప్రత్యేక పూజలు చేయించి అనంతరం ఈ దోషాల నుంచి బయట పడవచ్చు.ముఖ్యంగా పితృదేవతలకు ఈ అమావాస్య రోజున పిండప్రదానం చేసి అనంతరం దానధర్మాలు చేయడం ఎంతో మంచిది.

ఈ పుష్యమాస అమావాస్య పితృదేవతల కోసం అంకితం చేయబడినది కనుక ఈ రోజు కొన్ని పనులను చేయటం వల్ల పితృదేవతలు సంతోషించి వారి ఆత్మ భూమి నుంచి సరాసరి వైకుంఠానికి వెళ్తుందని ప్రతీతి.మరి పూర్వీకుల సంతోషం కోసం ఎలాంటి పనులు చేయాలి అనే విషయానికి వస్తే.ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజున శ్రీ కృష్ణుడిని పూజించి గీతా పఠనం చేయాలి.

అదేవిధంగా మన పూర్వీకులను గుర్తు చేసుకొని వారి పేరుతో దానధర్మాలను బట్టలను దానం చేయాలి.ముఖ్యంగా ఈ రోజు రావి చెట్టుకు నీళ్లు పోయడం, రావి చెట్టు కింద దీపారాధన చేయడం ఎంతో ఉత్తమం.
వీలైనంత వరకు ఈ పుష్యమాస అమావాస్య రోజు పీపుల్ చెట్టు నాటడం వల్ల ఎంతో శుభం కలుగుతుందని పండితులు చెబుతారు.ఇలా పుష్యమాసంలో వచ్చే ఈ అమావాస్య తిథిలో పిండప్రదానాలు ప్రత్యేక పూజలు చేయించడం ద్వారా పితృ దోష కాలసర్పదోషాల నుంచి బయట పడవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy