Airport Luggage Damage: ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్‌ లగేజీ బ్యాగ్‌ డ్యామేజీ.. విమాన సిబ్బంది బాగోతం ఇది!

బేసిగ్గా విమాన ప్రయాణం అంటేనే చాలా నియమ నిబంధనలు ఉంటాయి.అయితే వీటికి అనుగుణంగా ప్రయాణికుడు మలుచుకోవలసి ఉంటుంది.

ముఖ్యంగా లగేజి రూపంలో ఒక్క బట్టలు తప్ప, మరేవీ పట్టుకెళ్ళకూడదు.అలా పట్టుకెళ్ళినపుడు వాటిని అంగీకరించరు.

అంగీకరించిన లగేజీని మాత్రం విమాన సిబ్బంది చాలా జాగ్రత్తగా కేరీ చేస్తారు.అయితే ఈ క్రమంలో ఓ ప్రయాణికుడికి ఓ వింత అనుభవం ఎదురైంది.

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఒకవైపు ఉంటే, మీ విలువైన వస్తువులు లగేజీ మరోవైపు ఉంటాయి.విమానంలో ప్రయాణించిన పలువురు ఇప్పటికే తమ లగేజీని పోగొట్టుకున్న అనుభవాలను సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం.

Advertisement

ఇక్కడ కూడా అలాంటి అనుభవమే జరిగింది.ఇక్కడ ప్యాసింజర్ తన సామాను తిరిగి పొందారు.

కానీ అది పూర్తిగా ధ్వంసమైపోవడం బాధాకరం.అవును, అతడి లగేజీ సూట్‌కేస్‌ పూర్తిగా డ్యామేజ్ అయింది.

దానికి విమాన సిబ్బందే కారణం.అతడు తన గమ్యస్థానం చేరుకున్న తర్వాత విమానం దిగి.

బ్యాగేజీ కౌంటర్ దగ్గర వున్న తన లగేజీని చూసి షాక్ అయ్యాడు.గుర్తుల ఆధారంగా అతడు తన సామాను సేకరించే పరిస్థితి వచ్చింది.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైలు..?

దానికి సంబంధించిన ఫొటోను అతగాడు సోషల్ మీడియాలో పెట్టగా పోస్ట్ చుసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విమాన సిబ్బంది ఈ లగేజీని విమానం నుంచి విసిరి కొట్టారా? అంటూ ఒకరి తరువాత ఒకరు ప్రశ్నిస్తున్నారు.ఈ ఒక్క ఫోటోపై 97 వేల మందికి పైగా కామెంట్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

సాధారణంగా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మన చేతిలో హ్యాండ్ బ్యాగ్ తప్ప మరే ఇతర లగేజీ ఉండదు.విమాన ప్రయాణంలో భద్రతా నిబంధనలే కాకుండా అనేక నిబంధనలు విధిస్తున్న విమాన సిబ్బంది ప్రయాణికుల లగేజీ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉందట చాలా దారుణం అని నెటిజన్లు అంటున్నారు.

తాజా వార్తలు