ఎమ్మెల్యే ఎంపీలకూ పార్టీ పదవులు ? టి.పిసిసి అధ్యక్షుడి నిర్ణయం 

కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud )తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడంతో పాటు, అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ వాటి అమలు దిశగా ముందుకు వెళుతున్నారు.

దీనిలో భాగంగానే కాంగ్రెస్ లో కొత్త కార్యవర్గానికి రూపకల్పన చేస్తున్నారు.పిసిసి కార్యవర్గంలో ఎంపీలకు , ఎమ్మెల్యేలకు( MPs and MLAs ) అవకాశం కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించుకున్నారు.

దీనివల్ల ఆయా పదవులకు మంచి గుర్తింపు వస్తుందని , ఎంపీలకు వర్కింగ్ ప్రెసిడెంట్లు ,ఎమ్మెల్యేలకు పార్టీ అధికార ప్రతినిధులుగా అవకాశం కల్పిస్తే మంచిదనే ఆలోచనతో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారట.

Party Posts For Mla Mps Are The Decision Of Tpcc President, Telangana Elections,

దీనివల్ల కార్యవర్గానికి ప్రాధాన్యం పెరగడమే కాకుండా,  జనాల్లోకి పార్టీని తీసుకు వెళ్లేందుకు సులువు అవుతుందని భావిస్తున్నారట.ఇదే అంశంపై ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తో చర్చించినట్లు సమాచారం.అలాగే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారట .ఏఐసిసి హైకమాండ్ కు కొత్త కార్యవర్గం జాబితాను పంపించాలని , త్వరలోనే ఏఐసీసీ కొత్త కార్య వర్గాన్ని ప్రకటిస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు .తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు గాంధీభవన్ ( Gandhi Bhavan )లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు కార్యకర్తల సమస్యలను కూడా ఈ సందర్భంగా పరిష్కరిస్తున్నారు.

Party Posts For Mla Mps Are The Decision Of Tpcc President, Telangana Elections,
Advertisement
Party Posts For MLA MPs Are The Decision Of TPCC President, Telangana Elections,

గాంధీభవన్ నుంచి జిల్లా స్థాయిలో కమిటీలన్నీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు  దీంతో పాటు నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారు వివిధ కమిటీలలో దాదాపు 200 మంది నేతలకు పార్టీ పదవులు దక్కపోతున్నాయట వైస్ ప్రెసిడెంట్ లు , వర్కింగ్ ప్రెసిడెంట్ లు,  సెక్రటరీలు ,జనరల్ సెక్రటరీలు,  జాయింట్ సెక్రటరీలు , ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లు పార్టీ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్ మెంబర్లు,  జిల్లా అధ్యక్షులకు త్వరలోనే అప్లికేషన్ల స్వీకరణ మొదలుకానున్నది.  వివిధ సామాజిక వర్గాలకు చోటు కల్పిస్తూ ఈ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం .పదవుల ఎంపికలో పార్టీ , ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ , ఈసారి పనిచేసే నేతలకే పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.ఈ విషయంలో హై కమాండ్ పెద్దలు కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో , జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఈ విధానాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారట.

ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని అధ్యక్షుల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించారట.హైదరాబాద్, సికింద్రాబాద్ , ఖైరతాబాద్, హైదరాబాద్ , మేడ్చల్,  రంగారెడ్డి జిల్లాలో అధ్యక్షులు ఎంపిక విషయంలో బలమైన నేతలకే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు