Kolusu Parthasarathy : నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ గా పార్థసారథి..!

నూజివీడు( Nuziveedu ) నియోజకవర్గ టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ గా పార్థసారథి( Kolusu Parthasarathy )ని నియమించారు.ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఆయన బరిలో దిగనున్నారు.

Parthasarathy As Nujiveedu Tdp In Charge

కాగా నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ గా మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వర రావు( Muddaraboina Venkateswararao: ) వ్యవహారించారు.నూజివీడు టికెట్ ను పార్థసారథికి ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ముద్దరబోయినకు సర్దిచెప్పేందుకు టీడీపీ హైకమాండ్ ప్రయత్నించినప్పటికీ ఆయన రాజీపడలేదు.

అంతేకాకుండా నిన్న తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ముద్దరబోయిన సీఎం జగన్ తో సమావేశం అయ్యారు.ఈ నేపథ్యంలో పార్థసారథిని నూజివీడు టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు.

Advertisement
Parthasarathy As Nujiveedu Tdp In Charge-Kolusu Parthasarathy : నూజివ
మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు