పాప ఇంటర్నెట్‌కి అడిక్ట్ అయిందని కుక్కని తీసుకొస్తే.. దాన్ని కూడా మార్చేసింది కదమ్మా!

ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్( Smartphone ), ట్యాబ్లెట్స్‌కు అడిక్ట్ అవుతున్నారు.వాటిలో కార్టూన్స్ చూడడం, లేదంటే గేమ్స్ ఆడటానికి అలవాటు పడుతున్నారు.

తల్లిదండ్రులు మందలిస్తే బాగా హర్ట్ అవుతున్నారు.వారికి ఒక్కసారి స్మార్ట్‌ఫోన్ ఇచ్చాక మళ్ళీ మాన్పించడం పేరెంట్స్‌కు పెద్ద సవాల్ గా మారుతోంది.

ఇంటర్నెట్, ట్యాబ్లెట్ ఉంటే చాలు పిల్లలు మిగతా ప్రపంచాన్ని మరిచిపోయి వాటిలో లీనమవుతున్నారు.అయితే ఒక పాప తల్లిదండ్రులు ఒక కుక్క పిల్లని ఇంటికి తీసుకువచ్చారు.

ఆ కుక్కపిల్లతో ఆడుకుంటూ పాప ఇంటర్నెట్ అడిక్షన్ నుంచి బయటపడుతుందని భావించారు.

Advertisement

కానీ జోక్ ఏంటంటే ఆ పాప తనకోసం తీసుకొచ్చిన కుక్కను కూడా ఇంటర్నెట్‌( Internet )కు బానిసను చేసింది.ఈ పాపతో పాటు ఆ కుక్క రోజూ ట్యాబ్లెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది.తల్లిదండ్రులు ఇది చూసి షాక్ అయ్యారు.

తన పిల్ల తన కుక్కని ఎలా మార్చేసిందో చూడండి అంటూ వారు ఒక వీడియో కూడా షేర్ చేశారు.ఆ వీడియోను ప్రముఖ వైరల్ పేజీ @TheFigen_ ఎక్స్‌ అకౌంట్ తాజాగా రీషేర్ చేసింది.

దీనికి ఇప్పటికే 57 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఇందులో ఒక పాప నేలపై పడుకొని ఒక ట్యాబ్లెట్‌లో ఏదో వీడియో కంటెంట్ చూస్తోంది.

ఈ పాప పక్కనే ఒక బుల్ డాగ్( Bull Dog ) పడుకొని ఉంది.అది కూడా ట్యాబ్లెట్‌లో వీడియో చూస్తూ ఉంది.అయితే ఏదో ఆసక్తికరమైన సీన్ ఇందులో కనిపించడంతో ఆ చిన్నారి వావ్ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

నూతన సంవత్సరం ఎర్రటి కాగితంపై ఇలా రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది!

తర్వాత కుక్క కూడా అంతే రియాక్ట్ అవుతూ ఆ ట్యాబ్లెట్‌కు మరింత దగ్గరగా కదిలింది.ఈ దృశ్యాలు చాలా ఫన్నీగా ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.వీటిని మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు