విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు

ప్రస్తుత రోజులలో ఆడపిల్లలకు, మహిళలకు(girls , women) ఎటువంటి రక్షణ లేకుండా పోయిందన్న మాటలో ఎటువంటి సందేహం లేదు.

స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి ఆఫీసులకు వెళ్లే మహిళల వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకచోట అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు.

అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలిసింది పోయి విరుద్ధంగా వ్యవహరించి అసభ్యకరమైన మెసేజ్ లను పిల్లలకు పంపుతున్నాడు.ఈ క్రమంలో ప్రస్తుతం ఒక విద్యార్థి వారి కుటుంబ సభ్యులు ఆ ఉపాధ్యాయుని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్పూర్(Hamirpur , Uttar Pradesh) లోని ప్రముఖ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు.

విద్యను చెప్పే ముఖేష్ చౌరాసియా(Mukesh Chaurasia) అనే టీచర్ తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు అసభ్యకరమైన సందేశాలు వీడియోలు పంపేవాడు.ఈ క్రమంలో విద్యార్థునులు తిరిగి ఆ టీచర్లు ప్రశ్నించడంతో వారిని కర్రలతో కొట్టు చిత్రహింసలు పెట్టేవాడు.

Advertisement

అయితే, ఈ క్రమంలో ఒక విద్యార్థిని ధైర్యం చేసి తన కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియచేసింది.దీంతో వెంటనే కుటుంబ సభ్యుల పాఠశాలలోకి ప్రవేశించి ఆ టీచర్ ను కొట్టారు.

వెంటనే ఈ ఘ్తన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

హమీర్‌పూర్‌(Hamirpur) జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ “ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ముఖేష్ చౌరాసియా (Mukesh Chaurasia)9వ తరగతి విద్యార్థికి అసభ్యకరమైన సందేశాలు పంపేవారు.విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుడిని చెప్పులతో కొట్టారు.టీచర్‌పై ఎఫ్‌ఐఆర్‌ (FRI)నమోదు చేశారు అంటూ రాసుకుని వచ్చారు.

మరికొందరు ఈ సంఘటనపై తీవ్రంగా స్పందిస్తూ.సదరు ఉపాధ్యాయుడికి తగిన శిక్ష కచ్చితంగా విధించాలంటూ డిమాండ్స్ చేస్తున్నారు.

ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు